ఈ మధ్య కాలంలో ఒక మీడియా ఛానల్ పనిగట్టుకొని మరీ, చిరంజీవి రాజకీయాలు వదిలేసి సినీ రంగానికి వస్తారని అంటే, చిరంజీవిని ఇప్పుడెవరు చూస్తారు? పాలిటిక్స్‌లోకి వచ్చి చరిష్మా అంతా పోగొట్టుకున్నాడంటూ అదే పనిగా కథనాలు ప్రసారం చేసి, చివరకు ‘ఖైదీ నంబర్ 150’ వంద కోట్లకి పైగా షేర్ తెచ్చుకుంటే దానినీ అంగీకరించలేకపోయింది.
164 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తప్పుడు ప్రచారం చేసారంటూ వచ్చిన వసూళ్లపై కూడా బురద జల్లే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని జాతీయ స్థాయిలో తీస్తామని చిరంజీవి అంటుంటే, ఇది బాహుబలిని చూసి పెట్టుకుంటోన్న వాత అని అభివర్ణిస్తోంది.
కేవలం రికార్డుల పిచ్చితోనే చిరంజీవి ఈ పని చేస్తున్నాడని అభాండాలు వేస్తోంది. బాహుబలి పేరిట రికార్డులు చూడడం ఇష్టం లేక ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో ఆ రికార్డులు కొట్టేయాలని చిరంజీవి చూస్తున్నాడని ప్రచారం చేస్తోంది. అయితే చిరంజీవి ఎక్కడా బాహుబలిని టార్గెట్ చేసి ఈ చిత్రం చేస్తున్నట్టు చెప్పలేదు. బాహుబలి వల్ల పెరిగిన మార్కెట్‌కి అనుగుణంగా, అంత స్కేల్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో హిందీ, తమిళ మార్కెట్లని కూడా టార్గెట్ చేస్తున్నామని చెప్పారు.
అది వదిలేసి అసలు చిరంజీవి ఈ ప్రయత్నమే చేయకూడదు అన్నట్టుగా మాట్లాడడం, అంతటి నటుడిని చిన్నచూపు చూడడం ఎక్కడి జర్నలిజమని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.