శతమానం భవతి సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద హిట్ ని అందుకున్నాడు హీరో శర్వానంద్. సంక్రాంతి టైం లో బాలయ్య – చిరు ల సినిమాలు కూడా పక్కకి పెట్టి మరీ తాను చాలా పెద్ద హిట్ కొట్టేసాడు శర్వానంద్. అదే జోరు తో ఇప్పుడు రాధ గా వచ్చిన శర్వానంద్ ఎలాంటి సినిమా అందించాడో చూద్దాం రండి
కథ , పాజిటివ్
చిన్నప్పటి నుండి కృష్ణుడంటే ఎక్కువగా ఇష్టపడే కుర్రాడు రాధాకృష్ణ (శర్వానంద్) తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనతో పెద్దయ్యాక పోలీస్ అవ్వాలని నిర్ణయించుకుని చివరికి పోలీస్ అయి ఒక పల్లెటూరిలో పోస్టింగ్ కు వెళతాడు. అలా డ్యూటీ మీద ఆ ఊరికి వెళ్లిన రాధాకృష్ణ అదే ఊరిలో ఉండే రాధ (లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు.
ఇంతలోనే అతనికి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా హైదరాబాద్ వచ్చిన అతనికి లోకల్ గా ఉండే పొలిటీషియన్ చేసిన దుర్మార్గాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కు తలపెట్టిన ద్రోహం తెలిసి ఎలాగైనా అతన్ని నాశనం చేయాలని ఫిక్సవుతాడు. అసలు ఆ పొలిటీషియన్ చేసిన తప్పులేంటి ? అతన్ని రాధ ఎలా దెబ్బకొట్టాడు ? ఈ మధ్యలో రాధ ప్రేమ కథ ఎలా సాగింది ? అనేదే ఈ సినిమా కథ.కమర్షియల్ ఫార్ములా ని నమ్ముకునే సినిమా మొత్తం నడుస్తుంది అనే పెద్ద పాజిటివ్ అనే చెప్పాలి .. రాధ క్యారెక్టర్ లో సర్వా నటన చాలా బాగుంది. కామెడీ నుంచి రొమాంటిక్ యాంగిల్ వరకూ అన్నింటా రాధ గా సర్వా కి మంచి మార్కులు పడతాయి. లావణ్య క్యారెక్టర్ కి పెద్ద స్కోప్ లేకపోయినా ఆమె బాగానే చేసింది కానిస్టేబుల్ షకలక శంకర్ తో కలిసి శర్వానంద్ అందించిన ఫన్ వర్కవుటైంది. ఇంటర్వెల్ సన్నివేశం కూడా కాస్త థ్రిల్లింగా అనిపించింది. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా సినిమా చూడొచ్చు. విలన్ గా చేసిన రవి కిషన్ తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.
నెగెటివ్ లు
రొటీన్ కథ ఈ సినిమాకి అతిపెద్ద నెగెటివ్ పాయింట్. ఫస్ట్ హాఫ్ ఆరంభం బాగా ఇచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అద్భుతంగా రాసుకున్న డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో పేలవంగా తీసాడు .. అక్కడక్కడా హీరోయిన్ ని పెట్టి సంబంధం లేని సీన్ లతో సెకండ్ హీరోయిన్ ని రప్పించి లాగేసాడు. కంటెంట్ లేకపోతే సెకండ్ హీరోయిన్ ని దింపడం అనివార్యం అయిపోయిన తెలుగు సినిమాలో మరొక అదే కథ. హీరో, హీరోయిన్ ను ప్రేమలోకి దింపడమనే సీక్వెన్స్ మరీ ఫన్నీగా తోచింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్టాఫ్ చివరికి గాని సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడం తో ఫస్టాఫ్ చాలా వరకు నీరసంగానే ఉండి రన్ టైమ్ కోసమే రూపొందించినట్టుంది. ఆఖరి 15 నిముషాలు అసలు ఎక్కనే లేదు.
మొత్తం మీద
మొత్తం మీద చూసుకుంటే రాధ సినిమా పరవాలేదు అనిపించేలా ఉంది. రన్ రాజా రన్ , శతమానం భవతి లాంటి సినిమాలతో పోలిస్తే చాలా తక్కువే కానీ ప్లాప్ వైపు చూపించే ఛాన్స్ కూడా లేకుండా ఉంటుంది చిత్రం. సినిమా ఆద్యంతం కామెడీ తో నింపడం తో థియేటర్ లు ఫుల్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు అనిపిస్తుంది. వీకెండ్ లో జనాలని విపరీతంగా కాకపోయినా ఒక మోస్తరు గా రాబట్టుకోగలిగే సత్తా ఉన్నవాడే ఈ రాధ.మొత్తం మీద చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ ఎంటరటైనర్లను ఇష్టపడే ప్రేక్షకులను ‘రాధ’ మెప్పిస్తాడు. ఇంకాస్త స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకుని ఉంటె శర్వా కెరీర్ కి మరొక బ్లాక్ బస్టర్ తగిలేది