‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడా? అని ఇండస్ట్రీలో ఒకటే చర్చ. దీనిపై జక్కన్న ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ.. వచ్చే ఏడాదిలో ప్రిన్స్ మహేష్‌బాబుతో ఓ సినిమా తీయడం గ్యారెంటీ అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఉన్నట్లుండి ఈ న్యూస్ బయటికి రావడానికి ఒక బలమైన కారణం కూడా వుంది. పదండి.. ఆ వివరాలేంటో మేటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం..
‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలయ్యే ముందు రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్‌తో సినిమాకి కమిట్మెంట్ ఉందని చెప్పాడు. త్వరలోనే తమ కాంబోలో ఓ మూవీ వుంటుందని ప్రకటించాడు. దీంతో.. ‘బాహుబలి-2’ తర్వాత వీరి కాంబో సెట్ అయ్యే ఛాన్స్ వుంటుందని అంతా భావించారు. కానీ.. ‘బాహుబలి’ రిలీజైనా జక్కన్న ఆ సినిమా ఊసే ఎత్తకపోవడం, మహేష్ వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టడంతో.. వారి కాంబో ఇప్పుడిప్పుడే సెట్ కాకపోవచ్చునని భావించారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలోనే వీరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని తెలిసింది.
గతంలో సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణకు జక్కన్న ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు వచ్చే ఏడాదిలో ఆయనతో సినిమా చేస్తానని జక్కన్న మరోసారి కలిసి మాటిచ్చాడు. ఈ సినిమా మహేష్‌తో చేయాలని నారాయణ కోరిక. ఇందుకు మహేష్ కూడా సుముఖంగానే వున్నాడు. ఈ రకంగా జక్కన్న-మహేష్ కాంబో కుదరనుందని సినీవర్గాల పక్కా సమాచారం. మొత్తానికి.. ఎప్పటినుంచో సినీజనాలు కోరుకుంటున్న వీరి కాంబో వచ్చే ఏడాదిలో కలవనుందన్నమాట.