బాహుబలి తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోను ఘన విజయాన్ని అందుకోవడంతో ఇకపై అందరూ నేషనల్ మార్కెట్‌ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అయితే రాజమౌళి, శంకర్, రజనీకాంత్‌కి తప్ప సౌత్ నుంచి వెళ్లి హిందీ మార్కెట్‌ని ట్యాప్ చేసే సత్తా ఎంతమందికి వుంది? రాజమౌళి లేకుండా కూడా బాహుబలి బ్రాండ్‌ని వాడుకోవచ్చని ప్రభాస్ ‘సాహో’తో ప్లాన్ చేసుకుంటున్నాడు.
హిందీ మార్కెట్‌ని కూడా దృష్టిలో వుంచుకుని ఈ చిత్రానికి బడ్జెట్ కేటాయించారు. అలాగే మహేష్ కూడా ‘స్పైడర్’తో బాలీవుడ్ మార్కెట్‌లో అడుగు పెడుతున్నాడు. మురుగదాస్‌కి అక్కడ కాస్త పేరు వుండడంతో ఈ చిత్రానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు. తాజాగా చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రాన్ని కూడా నేషనల్ లెవల్లో టార్గెట్ చేయాలని చూస్తున్నారు. చిరంజీవికి హిందీలో స్ట్రెయిట్ సినిమాలు చేసిన హిస్టరీ వుంది. అయితే ఆయన అక్కడ తెలుగులో మాదిరిగా సక్సెస్ అవలేదు. మరిప్పుడు ఈ వయసులో మెగాస్టార్ సినిమా పట్ల నార్త్ వాళ్లు ఆసక్తి చూపిస్తారనేది అనుమానమే.
అసలే ఇప్పుడు బాహుబలి తరహా చిత్రాలు, పీరియడ్ సినిమాలు మరింత మంది ప్లాన్ చేస్తున్నారు. కనుక ఉయ్యాలవాడకి బాహుబలికి దక్కిన స్పెషల్ గుర్తింపు వుండదు. కానీ నిర్మాణ పరంగా అత్యంత క్వాలిటీ నిర్మించే సత్తా కొణిదెల ప్రొడక్షన్స్‌కి వుంది కనుక ఆ విధంగా ఉయ్యాలవాడతో అక్కడి వారిని ఆకర్షించవచ్చు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సాధించిన రికార్డులని కూడా మనం తక్కువ అంచనా వెయ్యకూడదు. చిరంజీవి సినిమా బాహుబలి స్థాయిలో విజయం సాధిస్తుందా ? లేదా ? అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చగా మారిన ఈ తరుణంలో.. మీ అభిప్రాయం ఏంటి ? క్రింద కామెంట్ చేయగలరు..