ప్రస్తుత జనరేషన్‌లో వున్న యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థకి ఓ ప్రత్యేక ఇమేజ్ వుంది. అందిరిలాగా ఒకే జోనర్ కథల్ని కాకుండా డిఫరెంట్ స్ర్కిప్ట్స్‌ని ఎంచుకోవడం వల్లే అతనికి ఆ గుర్తింపు లభించింది. నిఖిల్ చిత్రాలంటే కచ్ఛితంగా ఏదో కొత్తదనం వుంటుందని, అది నూటికినూరు శాతం శాటిస్ఫై చేస్తుందనే నమ్మకంతో ఆడియెన్స్ థియేటర్లకి పరుగులు పెడుతున్నారు. దాంతో.. అతని మూవీలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. తాజాగా ‘కేశవ’ కూడా కనకవర్షం కురిపిస్తోంది.
మే 19వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో రూ.11.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ఇదివరకే యూనిట్ తెలిపింది. ఇప్పుడు షేర్ విలువ బయటికొచ్చింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం మూడురోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.4.70 కోట్ల షేర్ రాబట్టింది. అందునా తెలుగు రాష్ట్రాల నుంచే రూ.3.99 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. నిజానికి ఇది పెద్ద ఫిగర్ కాదు కానీ.. ‘బాహుబలి-2’లాంటి పెద్ద చిత్రానికి ధీటుగా పోటీనిస్తూ ఈ రేంజ్ వసూళ్లు కొల్లగొట్టడం చెప్పుకోదగిన విషయమే. వీక్ డేస్‌లలోనూ ఈ సినిమా డీసెంట్ వసూళ్లతోనే దూసుకుపోతోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఏరియాల వారీగా మూడు రోజుల కలెక్షన్స్ క్రింది విధంగా వున్నాయి.. (కోట్లలో)
నైజాం : 1.65
సీడెడ్ : 0.44
నెల్లూరు : 0.10
కృష్ణా : 0.34
గుంటూరు : 0.29
వైజాగ్ : 0.64
ఈస్ట్ గోదావరి : 0.30
వెస్ట్ గోదావరి : 0.23
ఏపీ+తెలంగాణ : రూ. 3.99 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా : 0.31
ఓవర్సీస్ : 0.40
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 4.70 కోట్లు (షేర్)