ఒక హీరోకి వరుసగా రెండు విజయాలు వరిస్తేనే.. అతని తదుపరి చిత్రంపై భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఆ మూవీ రైట్స్ దక్కించుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతుంటారు. అలాంటిది.. డబుల్ హ్యాట్రిక్ హిట్స్‌తో ఫుల్ జోష్‌లో వున్న నాని నెక్ట్స్ మూవీ ‘నిన్ను కోరి’కి పోటీ ఏ స్థాయిలో వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంచనాలకు మించి ఎక్కువగానే వుండొచ్చని ట్రేడ్ నిపుణులు ఇదివరకు తెలిపారు. మొత్తానికి.. వారు చెప్పిన జోస్యం ప్రకారమే ఈ మూవీ అదిరిపోయే రేంజులో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దేశవ్యాప్తంగా రూ.20 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులే రూ.15 కోట్లు పలకడం విశేషం. ఇక శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్‌కి కూడా ఫ్యాన్సీ రేటు పలికనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ వివరాలు కూడా వెల్లడికానున్నాయి. ఇంతవరకూ ఒక్క పాటగానీ, టీజర్‌గానీ విడుదల కాకపోయినప్పటికీ.. ‘నిన్ను కోరి’ చిత్రం ఈ స్థాయిలో బిజినెస్ చేయడం చెప్పుకోదగిన విషయమే. దీన్ని బట్టి.. నాని క్రేజ్ ఏ రేంజులో వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
నూతన దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తుండగా.. నాని సరసన నివేద థామస్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.