Movies‘బాహుబలి-2’ రెండు వారాల కలెక్షన్స్.. ఇంకా తగ్గని సునామీ

‘బాహుబలి-2’ రెండు వారాల కలెక్షన్స్.. ఇంకా తగ్గని సునామీ

ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్‌ మార్కెట్ ఒకప్పుడు చాలా తక్కువగా వుండేది. 50 కోట్ల క్లబ్‌లో చేరడమే కత్తిమీద సాము అన్నట్లుగా వుండేది. అప్పటివరకూ ఆ క్లబ్‌లో ఎంటరైన సినిమాలు కేవలం నాలుగే అంటే.. అప్పటి పరిస్థితులు ఎలావుండేవో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. ఆ చిత్రం కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.127 కోట్ల షేర్ కొల్లగొట్టి.. తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. తర్వాతి సినిమాలకు ఆ దిశగా నడిపించడంలో ప్రేరణ కల్పించింది. ఇప్పుడు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ అయితే అవధుల్లేకుండా దూసుకెళ్లిపోతోంది. ఇప్పటికే రూ.150 కోట్లు కొల్లగొట్టేసిన ఈ చిత్రం.. రూ.200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. నిన్న గురువారంతో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ.160.20 కోట్లు (షేర్) కలెక్ట్ చేసింది. తెలుగు చలనచిత్రంలో ఇది చారిత్రాత్మక ఫిగర్‌. బహుశా దీన్ని బీట్ చేయడానికి మరో ‘బాహుబలి’లాంటి సినిమా రావాల్సిందే. విశేషం ఏమిటంటే.. నైజాంలో రూ.50 కోట్ల మార్క్‌ని కూడా క్రాస్ చేసేసింది. ఇది కూడా తిరుగులేని రికార్డే. ఇక మిగిలిన ఏరియాల సంగతి చూసుకుంటే.. ట్రేడ్ వర్గాల షాకైపోయే రేంజులో భారీ వసూళ్లు కొల్లగొట్టేసింది. ఆ వివరాలు క్రింది విధంగా వున్నాయి… (కోట్లలో)

నైజాం : 53.57
సీడెడ్ : 27.90
ఉత్తరాంధ్ర : 21.18
ఈస్ట్ గోదావరి : 14.60
వెస్ట్ గోదావరి : 10.66
కృష్ణా : 11.29
గుంటూరు : 14.8
నెల్లూరు : 6.20
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 160.20 కోట్లు (షేర్)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news