బాలీవుడ్ ముగ్గురు ఖాన్‌ల చిత్రాలకి తప్ప పాకిస్తాన్‌లో ఇండియన్ సినిమాలకి అంతగా ఆదరణ వుండదు. కానీ బాహుబలి చిత్రానికి అక్కడ ఆరు కోట్ల పాకిస్తానీ రూపాయలు ఇంతవరకు వసూలైనట్టు అక్కడి డిస్ట్రిబ్యూటర్ బాలీవుడ్ మీడియాకి తెలియజేసాడు. పూర్తిగా హిందూ సంప్రదాయాలకి అనుగుణంగా రూపొందిందని, మరో మత ప్రస్తావన లేదని బాహుబలిపై ఒక వర్గం విమర్శలు గుప్పించింది.
కానీ ఇలాంటివి పాకిస్తానీయులకి అభ్యంతరకరం అనిపించకపోవడం విశేషం. ఈ చిత్రాన్ని ఒక సినిమా కథలా చూస్తూ మిగతా వాటికి వారు అంతగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. రానున్న రోజుల్లో బాహుబలి 2 ఇక్కడ మరిన్ని వసూళ్లు సాధిస్తుందని, నానాటికీ ప్రజాదరణ పెరుగుతోందని అక్కడి డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు. ఇదిలావుంటే నేపాల్‌లో బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించి మునుపటి టాప్ సినిమా కంటే పది కోట్లు ఎక్కువ వసూళ్లు తెచ్చుకుంది.