‘బాహుబలి’.. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి దీనిపేరే ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతోంది. ఇందుకు కారణం.. ఇండియన్ సినీ చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా కలెక్షన్ల సునామీ సృష్టించడమే. ఏదో ఒకటి లేదా రెండువారాల వరకు కనకవర్షం కురిపించిందంటే ఏమో అనుకోవచ్చు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల సత్తా సైతం అంతవరకే వుంటుంది. కానీ.. ‘బాహుబలి’ మాత్రం అలాకాదు.. రిలీజైన రోజునుంచి ఇప్పటివరకు కలెక్షన్ల మోత మోగిస్తూనే వుంది.
తొలివారంలోనే దాదాపు బ్రేక్ ఈవెన్‌కి చేరిపోయిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా తన దూకుడిని కొనసాగిస్తూనే వస్తోంది. విడుదలవుతున్నఇతర సినిమాల్ని సైతం డామినేట్ చేస్తూ.. ఖాతాలో ఊహించని వసూళ్లు వేసుకుంటోంది. దీంతో.. ‘బాహుబలి-2’ నమ్మలేని లాభాల్ని తెచ్చిపెట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ సినిమా మొత్తం 24 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.746.88 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.430 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ చిత్రం.. అందుకు రెట్టింపు లాభాల్నే తెచ్చిపెట్టింది. ఇంకా ఈ మూవీ దూసుకెళ్ళడాన్ని చూస్తుంటే.. త్వరలోనే 800 కోట్ల (షేర్) క్లబ్‌లోకి చేరిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏరియాలవారీగా ఈ మూవీ 24 రోజుల కలెక్షన్స్ క్రింది విధంగా వున్నాయి… (కోట్లలో)
నైజాం : 62.28
సీడెడ్ : 31.85
నెల్లూరు : 7.15
కృష్ణా : 13.07
గుంటూరు : 16.59
వైజాగ్ : 24.11
ఈస్ట్ గోదావరి : 16.01
వెస్ట్ గోదావరి : 11.68
ఏపీ+తెలంగాణ : రూ. 182.74 కోట్లు
కర్ణాటక : 47.60
తమిళనాడు : 65.20
కేరళ : 27.78
రెస్టాఫ్ ఇండియా : 263.06
ఓవర్సీస్ : 160.50
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : 746.88