‘బాహుబలి-2’ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. నాలుగోవారంలో కూడా ఈ చిత్రం చెప్పుకోదగిన వసూళ్లు రాబడుతోంది. వీక్ డేస్‌లలో కూడా డీసెంట్ కలెక్షన్లు కలెక్ట్ చేస్తోంది. ఈ చిత్రానికి పోటీగా ఇతర మూవీలు రిలీజైనప్పటికీ.. వాటిని పూర్తిగా డామినేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద రప్ఫాడించేస్తోంది. దీంతో.. తెలుగు చిత్రపరిశ్రమకి ఎన్నడూ సాధ్యంకాదనుకున్న 200 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసే దిశగా ఈ మూవీ దూసుకెళ్తోంది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం మొత్తం 26 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 185.41 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఇంకా ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే.. కచ్ఛితంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేగనుక నిజమైతే.. అదో తిరుగులేని ఆల్‌టైమ్ రికార్డ్‌గా నిలిచిపోవడం ఖాయం. కాగా.. ఈ చిత్రం ఏపీ, తెలంగాణాల్లో రూ.130 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు చూస్తే.. డిస్ట్రిబ్యూటర్ల ఎంత ఎక్కువ లాభం వచ్చిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఏరియాలవారీగా 26 రోజుల కలెక్షన్స్ : (కోట్లలో)
నైజాం : 63.03
సీడెడ్ : 32.50
వైజాగ్ : 24.49
గుంటూరు : 16.81
ఈస్ట్ గోదావరి : 16.20
కృష్ణా : 13.28
వెస్ట్ గోదావరి : 11.78
నెల్లూరు : 7.32
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 185.41 కోట్లు