ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ మితి మీరిన వేగంతో కారు నడిపి తన స్నేహితుడితో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన రెండు రోజులు కాలేదు. ఈ లోపే హైదరాబాద్ లోని కావూరి హిల్స్ ప్రాంతంలో ఓ కారు ఇదే రీతిలో భీభత్సం సృష్టించింది. అతి వేగంతో కారు నడిపిన ఓ యువతి ఆ ప్రాంతంలో అలజడి రేకెత్తించింది. అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి ప్రాణం పోలేదు కానీ.. ఆమె కారు సృష్టించిన భీభత్సానికి ఆ ఏరియాలో కలకలం రేగింది.మితిమీరిన వేగంతో రాంగ్ రూట్లో వచ్చిన ఓ యువతి తన మినీ కూపర్ కారుతో వెనుక నుంచి ఓ టాటా సఫారీ కారును వేగంగా ఢీకొట్టింది.