చాలా మంది హీరోలలాగా యాక్టింగ్, డ్యాన్స్‌ల విషయంలో నేను మరీ ఎక్కువ ప్రతిభావంతుడిని కాదని పవనే స్వయంగా ఒప్పుకుంటాడు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేరే ఏ హీరోకూ లేని గొప్పదనం ఒకటి పవన్‌కి ఉంది. అదే ఫ్యాన్స్. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్. పవన్‌ని దేవుడిగా కొలిచే ఫ్యాన్స్. ఈ విషయంలో మాత్రం మిగతా అందరి హీరోలకంటే ఎంతో ముందుంటాడు పవన్. పవన్ ఫ్యాన్స్‌కి పవన్ సినిమా ఎలా ఉంది? కథ ఏంటి అనే విషయాలతో అస్సలు సంబంధం లేదు. మన హీరో సినిమా రిలీజ్ అయింది. వెళ్ళి చూడాల్సిందే. అది కూడా ఎంత టికెట్ రేటు అయినా పెట్టి మొదటి రోజే చూడాల్సిందే అని గట్టిగా ఫీలయ్యే అభిమానులు మిగతా హీరోల అందరికంటే కూడా పవర్ స్టార్‌కే ఎక్కువ. అదే పవర్ స్టార్ బలం.
పవన్ సినిమా రికార్డ్స్ కొల్లగొట్టాలని వరుసగా సినిమా చూసే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే తన సినిమా కలెక్షన్స్‌తో ట్రేడ్ పండిట్స్‌ని కూడా షాక్‌కి గురిచేస్తూ ఉంటాడు పవన్. ఇప్పుడు మరోసారి అదే చేశాడు. గబ్బర్‌సింగ్‌కి ముందు కూడా పవన్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్స్ మాత్రం వేరే హీరోల హిట్ సినిమాలతో సమానంగా ఉండేవి. ఇక గబ్బర్‌సింగ్ తర్వాత నుంచి మాత్రం వరుసగా యాభై కోట్ల క్లబ్‌ని సింపుల్‌గా దాటేస్తున్నాడు పవన్. బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన గబ్బర్‌సింగ్, అత్తారింటికిదారేదిల గురించి కొత్తగా చెప్పేదేముంది. కాకపోతే కొంచెం అటూ ఇటూగా ఆడిన….ఫ్లాప్ ముద్ర వేయించుకున్న సినిమాలు కూడా సింపుల్‌గా యాభై కోట్ల క్లబ్‌లో చేరేలా చేయడమే పవన్ స్పెషాలిటి. గోపాల గోపాల, సర్దార్ గబ్బర్‌సింగ్‌తో ఆ ఫీట్‌ని సాధించాడు పవన్. ఇప్పుడిక కాటమరాయుడితో కూడా అంతకుమించి అనే స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టాడు పవన్. సర్దార్ గబ్బర్‌సింగ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రావడం ఖాయమని ట్రేడ్ పండిట్స్ చెప్తున్నారు. దాదాపుగా 60 కోట్ల పైచిలుకు కలెక్షన్స్‌తో కాటమరాయుడు దూసుకెళ్ళడం ఖాయమని చెప్తున్నారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు ఇంకా చాలా మంది టెక్నీషియన్స్, నటులు కూడా సినిమాకు మైనస్ అయినప్పటికీ కేవలం పవర్ స్టార్ స్టామినాతో ఈ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం అంటే మాటలా? దట్ ఈజ్ ఒన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్….అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్.