ఎన్టీఆర్ మరోసారి మెస్మరైజ్ చేశాడు. నిక్కర్లేసుకునే వయసులోనే కలెక్షన్స్ సునామీ సృష్టించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్‌కి ఇదేమైనా కొత్తా అని అడక్కండి. ఇప్పుడు మెస్మరైజ్ చేసింది స్క్రీన్ యాక్టింగ్‌తో కాదు. రియల్ లైఫ్‌లో. ఎన్టీఆర్ ఇంగ్లీష్ మాట్లాడతాడా? ఎన్టీఆర్‌కి మెచ్యూరిటీ ఉందా?లాంటి ప్రశ్నలన్నింటికీ ఒక్క స్పీచ్‌తో సమాధానం ఇచ్చేశాడు. మహేష్, పవన్‌ల కంటే కూడా చాలా చిన్నవాడైనా ఎన్టీఆర్…మెచ్యూరిటీ విషయంలో ఎవ్వరికీ తక్కువ కాదు అని నిరూపించాడు. ఆన్‌స్క్రీన్ పై యాక్టింగ్ విషయంలో చాలా మంది కంటే ఎంతో గొప్ప ప్రతిభావంతుడు అయిన ఎన్టీఆర్….ఆఫ్‌స్క్రీన్‌లో కూడా అంతే గొప్పగా ఉంటానని నిరూపించాడు.
ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న ఏ హీరో అయినా ఏం మాట్లాడతాడు? సినిమా ఫంక్షన్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. కానీ ఎన్టీఆర్ మాత్రం….రొటీన్‌గా నాలుగు ముక్కలు చెప్పేసి వెళ్ళిపోవాలనుకోలేదు. మామూలుగా కూడా తన ఒరిజినల్ ఫీలింగ్స్‌కి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం ఎన్టీఆర్ నైజం. రాజమౌళి లాంటి గొప్ప స్నేహితుడిని తనతో సినిమా చేయమని అడగడానికి ఎలాంటి శషబిషలు…ఇమేజ్ ప్రాబ్లమ్స్‌లాంటి వాటిని అస్సలు పట్టించుకోడు ఎన్టీఆర్. హీరోయిజం బిల్డప్పులు అవసరం లేదనుకుంటాడు. ఇప్పుడు ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న సందర్భంలో కూడా అంతే స్వచ్ఛంగా స్పందించాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ సినిమాతో నేచర్‌ని ఎంత గౌరవంగా చూసుకోవాలో చెప్పడం తనకు చాలా గొప్పగా అనిపించిందని చెప్పాడు. అందుకే జనతా గ్యారేజ్ సినిమాని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటునన్నాడు. తన స్పీచ్ అయిన తర్వాత …..నీ అభిమాన నటుడు ఎవరు అని రానా అడిగిన ప్రశ్నకు కూడా చాలా హుందాగా గొప్పగా స్పందించాడు ఎన్టీఆర్. బాహుబలి తర్వాత రానాకు ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. అలాగే ఈ తరం హీరోలలో గొప్ప అందగాడు మహేష్ బాబు అని చెప్పాడు. ఇక నానీ నటన గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు ఎన్టీఆర్. తాత నందమూరి తారకరామారావు నుంచి ఇప్పటి వరకూ కూడా ఏ సినిమాలో ఎవరు గొప్పగా యాక్ట్ చేసినా వాళ్ళను అభిమానిస్తానని చెప్పాాడు. ఎన్టీఆర్ ఇంగ్లీష్ స్పీచ్ కూడా చాలా విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పింది. అభిమానులతో పాటు….ఆ ఫంక్షన్‌కి వచ్చిన ఆహూతులను కూడా విశేషంగా అలరించిన ఎన్టీఆర్ స్పీచ్ ఫుల్ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చెయ్యండి.
https://youtu.be/pXFsM2dYrP8?t=10s