బాలకృష్ణ కెరీర్ లో మొట్ట మొదటి సారి యాభై కోట్ల షేర్ వసూలు చేసిన చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణి నిలబడింది. ఈ చిత్రం థియేటర్ లలో కంటే టీవీ లలో ఇంకా పెద్ద రికార్డు అవుతుంది అని అనుకున్నారు అందరూ కానీ థియేటర్ లలోనే బాగా ఆడింది. విడుదల అయిన మూడు నెలల టైం లేకుండా టీవీ లలో ఈ సినిమా వేసారు కానీ టీఆర్పీ మాత్రం రాలేదు. కేవలం ఐదున్నర రేటింగ్ తో ప్లాప్ గా నిలిచింది. ఎంత ప్లాప్ సినిమాకి అయినా కనీసం ఆరున్నర టీఆర్పీ వస్తుంది కానీ ఈ చిత్రానికి ఎక్కువ సొమ్ము పెట్టి కొనుక్కున్న మా టీవీ వారికి చుక్కలు కనపడ్డాయి. మరోవైపు సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ అయిన శతమానం భవతికి టీవీల్లో కూడా బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. తొలి ప్రదర్శనలో 15.5 రేటింగ్‌తో ఈ సినిమా టీవీ రంగంలోకి బ్లాక్‌బస్టర్ ఎంట్రీనిచ్చింది.