మార్చి 16 న రిలీజ్ అయిన బాహుబలి రెండవ భాగం ట్రైలర్ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 85 మిలియన్ల పైగా వ్యూస్ తో దేశం లోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాగా… అది కూడా చాలా తక్కువ (4 రోజులు) సమయంలో రాబట్టిన సినిమాగా మన దేశంలోనే మొట్ట మొదటి స్థానంలో నిలిచింది. రాజమౌళి, ప్రభాస్, రానా మరియు ఈ చిత్ర నిర్మాతలు సినిమా ప్రమోషన్ల కార్యక్రమాల్లో బిజీ బిజీ అయ్యారు. ఏప్రిల్ 28 న మన ముందుకు రాబోతున్న బాహుబలి రెండవ భాగం సినిమా పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక మన మీడియా కూడా ఆ సినిమా పై ఆసక్తికర వార్తలను వండి వార్చేందుకు సిద్ధమైంది.
బాహుబలి కోసం ప్రభాస్ దాదాపుగా 5 సంవత్సరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. మధ్యలో అవకాశమున్నా కానీ ప్రభాస్ వేరే సినిమాల జోలికి వెళ్ళలేదు. ఈ సినిమాలో నటించిన రానా ఘాజి సినిమా చేసి హిట్ కూడా కొట్టాడు. అలాగే అనుష్క, తమన్నాలు కూడా వేరే సినిమాల్లో నటించారు.ఇవి కేవలం మనకు తెలిసిన విషయాలు. అయితే మనందరికీ అబ్బురమనిపించే విషయం ఏంటంటే ప్రభాస్ లుక్ మరియు ఫిజిక్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 15 కోట్ల రూపాయలు వెచ్చించారు. లక్ష్మణ్ రెడ్డి సారథ్యం లోని ట్రైనర్లు ప్రభాస్ లుక్,ఫిజిక్ ల కోసం ఎంతో శ్రమించారు. పర్ఫెక్ట్ మీల్స్, కరెక్ట్ టైం లో అందేలా చేయడం, రెండు పాత్రలు మహేంద్ర బాహుబలి మరియు అమరేంద్ర బాహుబలి కి తగ్గట్టుగా మార్పు కనిపించటానికి చాలా కష్ట పడ్డారు. ప్రభాస్ కి ఖర్చు చేసిన డబ్బు తో 10 లోబడ్జెట్ సినిమాలు మంచి క్వాలిటీ తో చేయొచ్చు. ఏది ఏమైనా ఖర్చు కి వెనకాడకుండా ఈ సినిమా కోసం బాహుబలి టీం పడ్డ శ్రమ కానీ, ఏ మాత్రం సహనం కోల్పోకుండా వెచ్చించిన సమయం కానీ ఎంతో అభినందనీయం. హాట్స్ ఆఫ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బాహుబలి.