ధీరుభాయి అంబానీ అంటే రిలయన్స్… రిలయన్స్ అంటే అంబానీ అని మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచస్థాయిలోనే ధనవంతుల లిస్ట్ లో చేరిన అంబానీ మాత్రమే మనలో చాలా మందికి తెలుసు. కానీ అతని గత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మణిరత్నం తీసిన ‘గురు’ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అఫీషియల్ గా కాకున్నా అది అంబానీ గురించే అని టాక్! ఏది ఏమైనప్పటికీ అంబానీ 300 రూపాయల జీతం తీసుకునే స్థాయి నుండి… ఎన్నో కోట్లకి అధిపతి ఎలా అయ్యాడో ప్రతీ ఒక్కరు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం.
చిన్న చిన్న ఓటములకే కృంగి కృశించి ప్రాణాలు తీసుకునే వారు కూడా మనకు తెలుసు.. అటువంటిది ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషి తో ఎదిగిన అంబానీ జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఉన్న దానితో సంతృప్తి పడకుండా కష్టపడితే సామాన్యుడు సైతం ఎంతటి స్థాయికైనా ఎదగవచ్చు అని చూపిన ధీరోదాత్తుడు మన ధీరుభాయి అంబానీ. అతని జీవిత గమనం మరియు అతని లక్ష్య సాధన తదితర విషయాల కోసం క్రింది వీడియో ని తప్పక చూడండి.మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి ఒక అద్భుతమైన వ్యక్తి జీవిత విశేషాలని అందరికీ తెలిసేలా మీ వంతు సాయం మీరు చేయండి.