News104 జ్వరంతో డాన్స్.. మెగాస్టార్ ఊరికినే అయిపోరు.. రియల్లీ హాట్స్ ఆఫ్...

104 జ్వరంతో డాన్స్.. మెగాస్టార్ ఊరికినే అయిపోరు.. రియల్లీ హాట్స్ ఆఫ్ చిరు !!

With his comeback movie Khaidi Number 150 megastar chiranjeevi breaks all the non-bahubali box office records. For the last four decades chiru is the inspiration to so many aspirants and so many people with his hardwork and dedication. Recently one we came to know a heart melting incident.. take a look!

చిరంజీవి ఈ పేరు గత 4 దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రియులకి ఎంతో శక్తినిచ్చే పేరు, మరెంతో ప్రోత్సాహం ఇచ్చిన పేరు.. స్వయంకృషి కి మారు పేరు అలాగే ఎంతో మంది నటీనటులకు ప్రేరణగా నిలుస్తున్న పేరు. 9 సంవత్సరాల గ్యాప్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా 61 సంవత్సరాల వయసులో కంబ్యాక్ సినిమా. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ తన ఖైదీ నెంబర్ 150 సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులని తిరగరాసి ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేశాడు మెగాస్టార్.

తెలుగు సినిమాల్లో ఎంతో కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న రాజా రవీంద్ర రీసెంట్ గా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ గురించి చెప్పిన విషయాల్లో ఒక విషయం మాత్రం అందరినీ కట్టిపడేసింది. అదేంటంటే శ్రీదేవి కాంబినేషన్ లో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అందులో ‘అబ్బ నీ తీయని దెబ్బ’ అనే పాట అయితే ఒక పెద్ద సెన్సేషన్. ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తున్న ఆ పాట షూటింగ్ సమయంలో చిరంజీవి కి 104 డిగ్రీల జ్వరం అంట.. అయితే శ్రీదేవి కాల్ షీట్ల సమస్య కాకూడదని భావించి.. మెగాస్టార్ మాత్రం అదే జ్వరంతో షూటింగ్ కొనసాగించాడట. షూట్ కంప్లీట్ అయ్యాక రెండు రోజుల వరకు స్పృహ కూడా లేదంట. ఎంతో వర్క్ పట్ల అంకితభావం ఉంటె కానీ ఇది సాధ్యం కాదు. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఆయన జీవితంలో ఉన్నాయంట. కొంచెం గుర్తింపు వస్తేనే భూమి మీద నిలబడలేని వ్యక్తులున్న కాలమిది.. కానీ మెగాస్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ఇప్పటికీ తన పని తాను ఎంతో డెడికేషన్ తో చేయటం… నిజంగా మెగాస్టార్ కి మెగాస్టారే సాటి!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news