HOllywood technician Vance Hartwell selected for NTR 27th film as makeup artist. This news officially confirmed by NTR Arts banner via twitter.
ఎన్టీఆర్ తన 27వ సినిమాని అధికారికంగా ప్రకటించిన కొత్తలో.. ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. ఈ చిత్రం తారక్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, సాంకేతిక విలువలతో రూపొందుతుందని టాక్ వినిపించింది. తొలిసారి తమ్ముడు తమ సొంత ప్రొడక్షన్ బ్యానర్లో నటిస్తున్న సందర్భంగా.. అతని కెరీర్లో ఓ మైలురాయిలానిలిచిపోయేలా ఉండేందుకు కళ్యాణ్ రామ్ ఇలా ప్లాన్ చేశాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్నాళ్లకి అలాంటిదేమీ లేదని, ఈ సినిమాని తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేయాలని యోచిస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. కానీ.. ఇందులో వాస్తవం లేదని, ఈ చిత్రాన్ని నిజంగానే లావిష్‌గా నిర్మిస్తున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు ఈ మూవీకోసం ఎంపిక చేసిన టెక్నీషియన్ల జాబితా చూస్తే.. అది అర్థం అవుతుంది.
ఇప్పటికే ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ సీకే మురళీధరన్‌ని ఎంపిక చేశారు. అతను అమీర్ ఖాన్ హిట్ చిత్రాలైన పీకే, త్రీ ఇడియట్స్, మొహెంజోదారో, తదితర భారీ సినిమాలకు పనిచేశాడు. ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ టెక్నీషియన్ని ఎంపిక చేశారు. ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’, ‘ఐరన్ మ్యాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘రోబో’ వంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ ప్రోస్ధటిక్స్, సాంకేతిక నిపుణుడు వాన్స్ హార్ట్వెల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఆయనతో ఎన్టీఆర్ కలిసి దిగిన ఓ ఫోటోని కూడా ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్రల్లో మూడు డిఫరెంట్ గెటప్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నాడన్నమాట. ఆ గెటప్‌లను తయారు చేయడం కోసం ఈ హాలీవుడ్ టెక్నీషియన్ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
కాగా.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘జై.. లవకుశ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో తారక్ పోషిస్తున్న మూడు పాత్రలకుగాను ముగ్గురు హీరోయిన్లను తీసుకోనున్నారు. ఆల్రెడీ రాశీఖన్నాని ఓ కథానాయికగా ఎంపిక చేయగా.. మరో ఇద్దరి తారల కోసం పరిశీలిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం జరుపుకుని, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Renowned Prosthetics & Legacy FX expert Vance Hartwell is on board #NTR27 .Previous works – Lord of the Rings,Iron Man,Life of Pi,Robo pic.twitter.com/9gK7IPQaZZ
— NTR Arts (@NTRArtsOfficial) 4 February 2017