Ceded top 5 telugu movies list. Baahubali stood at the top and Khaidi in second place.
సీడెడ్ ఏరియాని మాస్ సినిమాలకు అడ్డాగా చెబుతుంటారు. ఎందుకంటే.. ఓ క్లాస్ చిత్రానికి ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ అక్కడ వసూళ్లు అంతంత మాత్రమే వస్తాయి. అదే ఓ మాస్ చిత్రానికి కాస్త హిట్ టాక్ వస్తే చాలు, అక్కడి బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే. టాప్-5 సినిమాల జాబితాని చూస్తే.. ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. దర్శధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి’ రూ. 20 కోట్లకుపైగా కలెక్షన్లతో మొదటి స్థానంలో ఉంటే.. ఆ తర్వాత ప్లేస్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమా రూ. 15 కోట్లకుపైగా వసూళ్లతో రెండు స్థానంలో ఉంది. విశేషం ఏమిటంటే.. కేవలం మూడు వారాల్లోనే చిరు చిత్రం అంతమొత్తం కలెక్ట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా అక్కడ డీసెంట్ వసూళ్లతో దూసుకెళుతోంది. ప్రస్తుతం వస్తున్న వసూళ్లు బట్టి చూస్తే.. టోటల్ రన్లో ఆ ఏరియాలో చిరు సినిమా రూ. 16-17 కోట్ల మధ్య కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక ‘ఖైదీ’ తర్వాత రామ్ చరణ్ ‘మగధీర’ చిత్రం రూ.13 కోట్లతో మూడో స్థానంలో ఉంది. 2009లో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో ఆ స్థాయి కలెక్షన్లు రాబట్టడం నిజంగా చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే.. ఈనాటి టికెట్ల రేట్‌తో పోల్చుకుంటే అప్పుడు చాలా తక్కువ. అలాంటి సమయంలో అంతమొత్తం కలెక్ట్ చేయడం రికార్డే. ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ (రూ.11 కోట్లు) నాలుగో స్థానంలోనూ, అల్లుఅర్జున్ ‘సరైనోడు’ (రూ.10.75 కోట్లు) ఐదో స్థానంలోనూ నిలిచాయి.
1. బాహుబలి : 20+ కోట్లు
2. ఖైదీ నెంబర్ 150 : 15 కోట్లు (3 వారాలు)
3. మగధీర : 13 కోట్లు
4. జనతా గ్యారేజ్ : 11 కోట్లు
5. సరైనోడు : 10.75 కోట్లు