Wife Vanaja’s boyfriend Ramesh killed her husband Murali.
మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన వాళ్లు బంధుత్వాల్ని సైతం లెక్క చేయడం లేదు. కేవలం తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం అయినవాళ్లని చంపుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. స్నేహితుడే కదా అని ఇంటికి చేరదీసిన పాపానికి ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు సమీపంలోని సాలవాక్కం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాలవాక్కం గ్రామానికి చెందిన మురళి (36) అనే వ్యక్తి శ్రీపెరుంబుదూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి చాలాకాలం క్రితమే వనజ అనే మహిళతో వివాహం అయ్యింది. ఈ దంపతులకి విక్రమ్, వినోద్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మురళీ వద్ద చిన్న భాగాలను తరలించే ప్రొక్లెయినర్ ఉంది. దీనిని శ్రీపెరుంబుదూరుకి చెందిన రమేష్ (28)కి అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో మురళి, రమేష్‌కి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మురళి ఓసారి అతనిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన భార్య వనజతో పరిచయం చేయించాడు. అలా రమేష్, వనజ మధ్య ఏర్పడిన స్నేహం.. కొన్నాళ్లకి వివాహేతర సంబంధానికి దారితీసింది. మురళి నైట్ డ్యూటీలకు వెళ్ళినపుడు రమేష్ సాలవాక్కం వచ్చి వనజతో కలిసి ఎంజాయ్ చేస్తూ వచ్చాడు.
ఈ విషయం మురళికి ఇరుగుపొరుగు వారు తెలియజేసినప్పటికీ.. అతను అంతగా పట్టించుకోలేదు. కానీ.. కొన్నిరోజుల తర్వాత తన భార్య వనజ వద్ద తనకు తెలియకుండా ఒక స్మార్ట్‌ఫోన్ ఉండడం మురళి కంటపడింది. దాన్ని తీసుకుని పరిశీలించగా.. అందులో కేవలం రమేష్ ఫోన్ నంబరు మాత్రమే ఉండటం చూసి ఖంగుతిన్నాడు. అప్పుడతను తన భార్యను మందలించడంతోపాటు రమేష్‌ను కూడా ఇంటికి రావొద్దంటూ గట్టిగా హెచ్చరించాడు. దీంతో పగ పెంచుకున్న రమేష్.. ఎలాగైనా మురళి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అందుకు కిరాయి ముఠా సభ్యులతో కలిసి హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ విషయాన్ని తన ప్రియురాలైన మురళి భార్య వనజకు చెప్పగా.. ఆమె కూడా అతనికి సహకరించింది.
ప్లాన్ ప్రకారం.. ఈనెల 19వ తేదీన మురళి పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, అతడ్నిరమేష్ అంతమొందించాడు. ఈ విషయాన్ని వనజకు తెలియజేయగా.. ఆమె మురళి ఏదో ప్రమాదంలో చనిపోయాడంటూ పోలీసుల ముందు నటించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. వనజ, రమేష్ అక్రమ సంబంధం గురించి తెలిసింది. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో వారిరువురిని పోలీసులు అరెస్టు చేశారు.