Chiranjeevi 151st film based on Uyyalawada Narasimha Reddy real story who fought for India Before 1857. Surender Reddy will handle this project under Konidela productions.
తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’తో బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి.. అప్పుడే తన తదుపరి సినిమాని రెడీ చేసే పనిలో బిజీ అయిపోయాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ని తీయాలనుకున్న తన చిరకాల కోరికని తీర్చుకునే సరైన సమయం ఇదేనని భావించిన చిరు.. ఆ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ ఈ సబ్జెక్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఉంచారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తొలుత ఈ సబ్జెక్టుకు దర్శకత్వ పగ్గాలు బోయపాటి శ్రీనుకు ఇవ్వాలని యూనిట్ భావించినట్లుగా వార్తలొచ్చాయి కానీ.. ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిని ఫైనలైజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ని అతను తనదైన స్టైల్‌లోనే హ్యాండిల్ చేస్తాడనే నమ్మకంతో.. అతని చేతికే ఈ హిస్టారికల్ మూవీని అందించబోతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. ఈ మూవీ షూటింగ్‌ని ఏప్రిల్‌లో ప్రారంభించి.. వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్‌కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా ప్రారంభించారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో చాలా లావిష్‌గా నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాడట.
1857లో జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సమరం కంటే పదేళ్లకు ముందే.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దేశం కోసం ప్రాణం అర్పించిన యోధుడు. ఈ బయోపిక్ చిత్రాన్ని ఎప్పటినుంచో చేయాలని చిరు కోరుకుంటూ వస్తున్నారు కానీ.. మధ్యలో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని భావించి.. చిరు ఈ స్టోరీతో తన 151వ చిత్రం చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.