సంక్రాంతి కి విడుదలయిన మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఆనందంలో మునిగి ఉన్న మెగా అభిమానులకి మరింత కిక్కు ఇచ్చే వార్త… చిరు 151 మరియు 152 సినిమాల దర్శకులు ఫిక్స్ అయ్యారు. అవును 2017 సంవత్సరంలో చిరు ఈ రెండు సినిమాలు చేయనున్నారు.
పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చిరు “తన అభిమానులు తనని యాక్సెప్ట్ చేసినంత కాలం.. తాను ఇక సినిమాలకు దూరం కానని.. అలాగే 2017 సంవత్సరంలో రెండు సినిమాలు చేయనున్నానని… 151 వ సినిమాని ‘ధృవ’ తో రామ్ చరణ్ కి సూపర్ హిట్ ని అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మాణంలో ఉంటుందని.. అలాగే 152 వ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండబోతుందని” తెలిపారు. ఒకరు సూపర్ స్టయిలిష్ డైరెక్టర్ కాగా మరొకరు అల్టిమేట్ మాస్ డైరెక్టర్… వీరి దర్శకత్వంలో చిరు సినిమా అంటే ఇక ఆ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2017 సంవత్సరం మెగా అభిమానులకి మరచిపోలేని సంవత్సరంగా మిగులుతుందని చెప్పవచ్చు.