Snehith Chowdary who portrayed Satakarni’s son role pulomavi is impressed by saying senior NTR’s Dana Veera Soora Karna in his latest interview.
‘తాత.. వీడ్ని నువ్వు చంపుతావా.. నన్ను చంపమంటావా’ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో ఆకట్టుకున్నాడు ఓ కుర్రాడు. బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఆయన తనయుడు ‘పులోమావి’గా నటించిన ఆ బాలుడు.. సినిమా మొత్తంలో ముద్దుముద్దు మాటలు చెబుతూ అందరి హృదయాల్ని దోచుకున్నాడు. ఏదో ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు కదా.. అందులో కొత్తేముంది.. ఎందరో చిన్నపిల్లలు సైతం సినిమాల్లో నటిస్తున్నారు కదా! అని తేలిగ్గా ఆ అబ్బాయిని తీసిపారేస్తే పొరపాటే. అతనిలో ఎంతో టాలెంట్ దాగివుంది.
ఖమ్మంజిల్లా బూడిదంపాడుకి చెందిన ఈ పులోమావి అసలు పేరు స్నేహిత్ చౌదరి. ‘శాతకర్ణి’లో తన నటనతో ఆకట్టుకున్న ఈ బాలుడిని తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా ఆ బాలుడు తనలో ఇమిడివున్న మరింత టాలెంట్‌ని చూపించాడు. ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో చెప్పిన భారీ డైలాగ్‌ని చెప్పాడంటే.. అతని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతను చెప్పిన ఆ డైలాగ్ వింటే.. మీరు కూడా భళా అనక మానరు. ఓసారి ఈ వీడియో చూడండి.. మీకే అతని టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది..
https://youtu.be/SLk-UJZhcMs