Do you know this, there are lot of secrets available in Samantha engagement saree which is really wonder. Read below article to know what are those.
హైదరాబాద్‌లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి నాగచైతన్య-సమంతల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఎందరో అతిరథ మహారథులు విచ్చేసిన ఈ వేడుకలో సమంత కట్టుకున్న చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే.. ఈ చీరలో అందరినీ అబ్బురపరిచే రహస్యాలు దాగి వున్నాయి.
సమంత చీర అంచును బాగా గమనిస్తే.. అందులో ‘ఏమాయ చేసావె’ చిత్రంలోని చై-శామ్‌ల ఓ సన్నివేశంతోపాటు బైక్‌పై వారివురు కలిసి వున్న చిత్రం కూడా కనిపిస్తుంది. అంతేకాదు.. అఖిల్ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. నిజంగా.. చాలా అద్భుతం కదూ. బంగారు వర్ణం అంచు కలిగిన ఈ తెలుపు చీరను ముంబయికి చెందిన డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చూడముచ్చటగా ఉన్న చై-శ్యామ్ జంట ఫోటోలపాటు చీర చిత్రం కూడా తెగ హల్‌చల్ చేస్తోంది. చీరలో ఆ దృశ్యాల్ని డిజైన్ చేసిన విధానం నిజంగా అమోఘం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.