వెయిట్ పెరుగుతున్న కొద్దీ తిండి తగ్గించాలనుకుంటాం. కానీ బయటి ప్రపంచంలోనేమో రకరకాల తిండి పదార్థాలు, తాగుడు పదార్థాలు మనల్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మనల్ని టెంప్ట్ చేయడం కోసమే ఇన్ని రకాల ఐటెమ్స్ మనకు కనిపిస్తాయా మనకే సందేహం వచ్చేలా ఉంటుంది ఆ పదార్థాల వ్యవహారం. పోనీలే…..మనసుకు నచ్చినంత తిందాం…ఆ తర్వాత ఎక్సర్‌సైజ్ చేద్దాం అని ఫుల్లుగా లాగిస్తూనే ఉంటాం. కానీ ఎక్సర్‌సైజులు చేయడానికి మాత్రం మనసు రాదు. చలికాలం చలికి భయపడి ముసుగుతన్నేస్తాం. వర్షాకాలం ఎలాగూ వానలే మనల్ని పడుకోబెడతాయి. ఎండాకాలం బాగా అలసిపోయి ఉంటాం. ఇంకేం ఎక్సర్‌సైజులు చేస్తాం. అందుకే బాడీ రోజు రోజుకూ షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. దానికి తోడు ఆయాసం, బిపి కూడా పెరుగుతూ ఉంటాయి.
మరి ఎలా? ఈ ఊబకాయానికి పరిష్కారమే లేదా? ఉంది అని ఇప్పటికే నిరూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇఫ్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి శశికుమార్ కూడా అదే విషయాన్ని నిరూపించాడు. శశికుమార్‌ది కూడా అదే సమస్య. తిండి కంట్రోల్ చేసుకోలేడు. ఎక్సర్‌సైజులు చేయలేడు. అందుకే వెయిట్ విషయంలో సెంచరీకి దగ్గరగా రీచ్ అయ్యాడు. అప్పుడు రియలైజ్ అయ్యాడు. ఎక్సర్‌సైజులు చెయ్యడం కష్టం అని తెలుసుకుని ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాడు. రైస్ తినడం మానేశాడు. కూల్ డ్రింక్స్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఫిట్నెస్ ట్రేనర్‌ని పెట్టుకోవడానికి మనవాడేమీ సినిమా స్టార్ కాదు కదా. కనీసం కోటీశ్వరుడు కూడా కాదు. అందుకే గూగుల్‌ని నమ్ముకున్నాడు. రకరకాల డైటింగ్‌కి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ గురించి తెలుసుకున్నాడు. సంవత్సరంలోనే 34కిలోలు తగ్గాడు. ఫేస్ బుక్‌తో పాటు సోషల్ మీడియా జీవులకు కూడా హీరో అయిపోయాడు. తను బరువు ఎలా తగ్గాను అనే విషయంపై అందరికీ సూచనలిస్తున్నాడు. ఫాలో అవుతారా మరి. ఆ…మనవళ్ళ కాదులే అని వదిలేస్తారా? ఆ వదులు ఎఫెక్ట్ బాడీపైన కూడా పడుతుంది మరి. ఏం చేద్దాం?