Dhruva 27 days collections report of Telugu states is out. This movie still earning decent collections at the domestic boxoffice.
ఫస్ట్ వీకెండ్ తర్వాత ‘ధృవ’ కలెక్షన్లు ఒక్కసారిగా డ్రాప్ అవ్వడంతో.. ఈ చిత్రం కనీసం 40 కోట్ల క్లబ్‌లో అయినా చేరుతుందా? అనే అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ.. నిస్పందేహంగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అంతేకాదు.. ఇప్పటికీ ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సంతృప్తికరమైన వసూళ్లు రాబడుతుండడం విశేషం.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం 27 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని రూ.40.87 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా ఏరియాలు కలుపుకుంటే.. ఈ సినిమా రూ.56 కోట్లపైనే వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఈ సినిమా హవా నడుస్తోంది కాబట్టి.. సంక్రాంతిలోపు ఈ సినిమా మంచి కలెక్షన్లు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి.. రెండు వరుస డిజాస్టర్ల తర్వాత రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఏరియాల వారీగా ఈ మూవీ 27 రోజుల కలెక్షన్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. (కోట్లలో)
నైజాం : 15.26
సీడెడ్ : 6.67
ఉత్తరాంధ్ర : 5.33
ఈస్ట్ గోదావరి : 3.15
వెస్ట్ గోదావరి : 2.72
కృష్ణా : 2.94
గుంటూరు : 3.47
నెల్లూరు : 1.33
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 40.87 కోట్లు