News'జల్లికట్టు , కోడిపందేల' వివాదాలపై కేంద్రంపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్

‘జల్లికట్టు , కోడిపందేల’ వివాదాలపై కేంద్రంపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చేది ముందుగా కోడి పందాలు, పతంగుల పండుగ.యువత మరియు చిన్న పిల్లలు పతంగులు ఎగురవేస్తుంటే.. కోడిపoదాలకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు పందెం రాయుళ్ళు . భారీ బెట్టింగుల మధ్య కోడి మహారాజులు కొట్టుకుంటుంటే పందెం రాయుళ్ల సంతోషానికి అవధులు ఉండవు. అయితే ఈ సంక్రాంతి పండక్కి కోర్టు కొంత కాలం నుండి అడ్డుకట్ట వేసినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఎవరి పంథాలో వాళ్ళు పండుగను జరుపుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కోడిపందాలతో పాటు తమిళనాడు లో జల్లికట్టు కూడా వివాదాస్పదం అయ్యింది.

జల్లికట్టు వల్ల మూగజీవాలు హింసకు గురవుతున్నాయని జంతు ప్రేమికులు అంటుంటే… ఆవులను కబేళాలకు పంపుతుంటే కనపడని హింస సాంప్రదాయ ఆటను కొనసాగిస్తుంటే మాత్రం కనపడుతుందా అని సాంప్రదాయవాదులు ప్రశ్నిస్తున్నారు. మూగ జీవాలను కబేళాలకు తరలించడంలో ప్రధమ స్థానంలో ఉన్న మన దేశం.. ఏ రకంగా జంతు హింసను నిర్మూలించగలదని,జంతు హింస జల్లికట్టు ద్వారానే జరుగుతుందని మాట్లాడగలరు.

ఇప్పుడు ఇదే విషయం దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది.గల్లీ నుంచి ఢిల్లీ దాకా జల్లికట్టు ను ఆపే ప్రయత్నం చేయవద్దు అని, దీనిపై ఆర్డినెన్సు తేవాలి అని తమిళులు అందరూ ఒక్కటై నినదిస్తున్నారు.సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేధం విధించడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనాబీచ్‌కు చేరుకున్న జల్లికట్టు మద్దతుదారులు, విద్యార్థులు శాంతియుత మార్గంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు.

మరో పక్క తెలుగు హీరోలు సైతం జల్లికట్టు పై స్పందిస్తున్నారు.. నిన్నటికి నిన్న జల్లికట్టుకి మహేష్ బాబు తన సంపూర్ణ మద్దతు తెలపగా.. ఇక జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో కేంద్రం పై వివిధ రుజువులు చూపుతూ విరుచుకుపడ్డారు. తమిళుల జల్లికట్టు కు మరియు తెలుగు రాష్ట్రాల్లో నిషేధం విదించిన కోడిపందేలపై వెంటనే కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ లు క్రింద గమనించగలరు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news