Moviesసంచలన రేటుకి ‘కాటమరాయుడు’ సీడెడ్ రైట్స్.. ‘ఖైదీ’ రికార్డ్ బ్రేక్

సంచలన రేటుకి ‘కాటమరాయుడు’ సీడెడ్ రైట్స్.. ‘ఖైదీ’ రికార్డ్ బ్రేక్

Pawan Kalyan’s latest movie Katamarayudu ceded rights have been sold for bomb price which breaks Chiranjeevi’s Khaidi no 150 record.

పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన స్టామినా ఇంకా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటే.. భారీ డిజాస్టర్ చవిచూసినప్పటికీ తన క్రేజ్ రోజురోజుకు మరింతగా పెరుగుతోందని పవన్ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా అన్నయ్య సృష్టించిన అరుదైన ఘనతని బ్రేక్ చేసేసి.. తన పేరిట సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ లేటెస్ట్ చిత్రం ‘కాటమరాయుడు’ సీడెడ్ హక్కుల్ని నరసింహ అనే ఓ డిస్ట్రిబ్యూటర్ అక్షరాల రూ.12.06 కోట్లకు సొంతం చేసుకున్నాడని తెలిసింది. ఆ ఏరియాలో ‘బాహుబలి’ (రూ. కోట్లు) తర్వాత అత్యధిక ధర పలికిన చిత్రం ఇదే. అంతకుముందు చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ రూ.11.07 కోట్ల భారీ రేటుకి అమ్ముడుపోయి, రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్‌ని పవన్ బద్దలుకొట్టేశాడు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో భారీ డిజాస్టర్ అందుకున్నప్పటికీ.. పవన్ మేనియా ఏమాత్రం తగ్గదలేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. చూస్తుంటే.. ఇతర ఏరియాల్లోనూ ఈ చిత్రం భారీ రేట్లకే అమ్ముడుపోయేలా కనిపిస్తుంది. ఓవరాల్‌గా.. 100 కోట్ల మార్క్‌ని దాటడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కిషోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని శరత్ మరార్ ‘నార్త్ ఎంటర్టైన్‌మెంట్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఇందులో పవన్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని.. మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news