According to industry sources, director Harish Shankar has planned a massive episode in Allu Arjun’s DJ movie like Gabbar singh anthyakshari sequence.
ఈ టైటిల్ చదివిన ప్రతిఒక్కరి ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయమే. ఎందుకంటే.. ఈవెంట్స్‌లలో ఫ్యాన్స్ కోరినట్లు పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికే బన్నీ ఏమాత్రం ఇష్డపడడు. నేరుగా ‘చెప్పను బ్రదర్’ అని అనేస్తాడు. అలాంటిది.. ఆయన ‘ధమాకా’ని వాడుకోవడం ఏంటి? అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది. దానికి సరైన సమాధానం కావాలంటే.. మేటర్లోకి వెళ్ళాల్సిందే.
ప్రస్తుతం అల్లుఅర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ (డీజే) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. పవన్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ మూవీలోని ‘అంత్యాక్షరి’లాంటి ఎపిసోడ్‌ని ప్లాన్ చేశాడట. ఈ రెండు సినిమాలకి దర్శకుడు హరీష్ శంకర్ కావడంతో.. ఈసారి కూడా అంత్యాక్షరి తరహాలోనే ఓ అదిరిపోయే సీక్వెన్స్ సిద్ధం చేశాడట. ఈ ఎపిసోడ్‌ని మరింత ఫన్నీగా ఉండేలా హరీష్ డిజైన్ చేశాడని, సినిమాలోకెల్లా అదే హైలైట్ అవుతుందని యూనిట్ వర్గాల సమాచారం.
నిజానికి.. ‘గబ్బర్‌సింగ్’ మూవీలో రౌడీలతో ‘అంత్యాక్షరి’ పెట్టాలనే ఆలోచన పవన్‌దే అయినా, హరీష్ దాన్ని గొప్పగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ సీన్‌ని చాలామంది కాపీ కొట్టారు కానీ.. ఎవ్వరూ ఆకట్టుకోలేకపోయారు. ఇప్పుడు హరీషే తన సీన్‌ని రీమేక్ చేస్తున్నాడు కాబట్టి.. అది ఎలా ఉంటుందా? అనే క్యూరియాసిటీ నెలకొంది.