ఎన్టీఆర్, బాలయ్య, చిరంజీవి, ప్రభాస్‌లా కాదు… వెరైటీగా నరుకుతానంటున్న నిఖిల్

nikhil siddhartha keshava movie story line leaked

Nikhil Siddhartha’s latest movie Keshava story line out and it is very curious which increases the expectations on film.

ఆవేశం.. ఈ రసాన్ని ఇష్టపడని తెలుగు హీరో ఎవరూ ఉండరు. మరీ ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయ్యాక.. అగ్ర హీరోలందరి ప్రథమ తాంబూలం ఆవేశానికే. ఆగ్రహం, ఆవేశంతో ఊగిపోవడం.. విలన్స్ తలలు తెగనరకడం వెరీ కామన్ అయిపోయింది. ఇక ఈ రసాన్ని ప్రదర్శించడంలో మాత్రం బాలయ్యకే మొదటిస్థానం దక్కుతుంది. నరకం మొదలెడితే పోస్ట్ మార్టంకి కూడా పనికిరారు అనే రేంజ్ బాలయ్యది. అడ్డంగా నరికేస్తా అని ఎన్టీఆర్, నాకంటే బాగా కత్తిని వాడలేరు అనే ప్రభాస్, పీకకోస్తా అన్న చిరంజీవిలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు.

తాజాగా యువ హీరో నిఖిల్ కూడా ఈ నరకడం జానర్‌లోకి వచ్చేశాడు. అయితే.. ఆ హీరోలందరిలా కాకుండా తాను వెరైటీగా నరుకుతానంటున్నాడు. అంటే ఆవేశంగా కాకుండా కూల్‌గా అన్నమాట. ఆవేశపడి నరికితే.. నరికించుకున్నవాడి సంగతి ఏమోకానీ ముందు నిఖిలే హాస్పిటల్ బెడ్ ఎక్కేస్తాడు. ఎన్ని మర్డర్స్ చేసినా.. కూల్‌గా ప్రశాంతంగా, నవ్వుతూ చేయాలన్నమాట. వెరైటీగా ఉంది కదా. అదే మరి మనవాడి పరిస్థితి. మనవాడికి గుండె ఎడమవైపున కాదు.. కుడివైపున ఉంటుంది. పొరపాటున ఆవేశపడినా ఆ గుండె ఆగిపోతుంది. అలాంటి వాడి జీవితాన్ని విలన్స్ నాశనం చేశారు. వాళ్ళపైన రివేంజ్ తీర్చుకోవడమే నిఖిల్ టార్గెట్.

కానీ.. ఆ ప్రాసెస్‌లో ఎక్కడా ఆవేశపడకూడదు. ఆందోళన చెందకూడదు. హార్ట్ బీట్ పెరిగేలా ఏమీ చేయకూడదు. బట్ స్టిల్ నరకడమే మనవాడి జీవితాశయం. మరి తన ఆశయాన్ని ఎలా సాధించాడు? విలన్స్‌ని ఎలా నరికేశాడు అన్న విషయం తెలుసుకోవాలని క్యూరియస్‌గా ఉన్నారు కదా. అయితే ‘కేశవ’ సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. ప్రశాంతంగా, నవ్వుతూ విలన్స్‌ని నిఖిల్ ఎలా నరికేశాడో తెలియాలంటే ‘కేశవ’ సినిమా చూడాల్సిందే.

Leave a comment