రూటు మార్చాడు…కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు…..వారెవ్వా నిఖిల్

nikhil-siddharth

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పి కొంతమంది ఫెయిల్యూర్ పీపుల్ లిస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా నిఖిల్‌ని చూసి నేర్చుకోవాలి. హ్యాపీడేస్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కూడా మొదట్లో మాస్ జపమే చేశాడు. నెక్ట్స్ టు రవితేజ అంటూ వరుస డిజాస్టర్స్ ఫేస్ చేశాడు. కానీ ఒక సారి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మాత్రం కుంగిపోకుండా తన కెరీర్ గురించి తాను నిజాయితీగా విశ్లేషించుకున్నాడు. తను వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదని తెలుసుకున్నాడు.

కట్ చేస్తే స్వామిరారా సినిమా నుంచి మనవాడి హ్యాపీడేస్ స్టార్ట్ అయ్యాయి. స్వామిరారా, కార్తికేయ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన నిఖిల్ తాజా సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దెబ్బకు మనవాడికి గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయి. వద్దన్నా కూడా కోట్లాది రూపాయలు వచ్చి ఒళ్ళో పడుతున్నాయి. నోటు రద్దు ఎఫెక్ట్ ఉన్నప్పటికీ నిఖిల్ సినిమాకు కనకవర్షం కురిపించారు ప్రేక్షకులు. ఇప్పుడు శాటిలైట్ రేటు కూడా అంతకుమించి అనే స్థాయిలో పలికింది. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాకు 4 కోట్ల రూపాయల శాటిలైట్ రేట్ వచ్చింది. ఇంచుమించుగా రవితేజ రేంజ్‌కి మనవాడి డెవలప్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత వస్తున్న ‘కేశవ’తో పాటు నాగార్జునతో మనవాడు చేయబోయే మల్టిస్టారర్ సినిమా కూడా హిట్టయ్యిందంటే మాత్రం ఒన్ ఆఫ్ ది టాప్ రేంజ్ స్టార్ హీరోగా నిఖిల్ నిలదొక్కుకోవడం ఖాయం. నిఖిల్ కెరీర్‌ని ఒకసారి పరిశీలిస్తే చాలు తరుణ్, ఉదయ్ కిరణ్‌లాంటి వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారో తెలుస్తుంది. అన్నట్టు మనవాడు ఇప్పుడు రామ్ చరణ్ ప్రొడక్షన్‌లోనూ, అలాగే త్రివిక్రమ్ సమర్పణలో చినబాబు ప్రొడ్యూసర్‌గా కూడా మరో సినిమా గురించి చర్చల్లో ఉన్నాడని తెలుస్తోంది. తన బలం ఏంటి? బలహీనత ఏంటి అనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్న నిఖిల్ ముందు ముందు ఇంకా ఏ రేంజ్ హిట్స్ కొడతాడో చూడాలి మరి.

Leave a comment