Nagarjuna Akkineni tweeted on Balayya’s prestigious project Gautamiputra Satakarni after a long time. He wishes team members.
ఒకప్పుడు బాలయ్య, నాగార్జునలు చాలా మంచి ఫ్రెండ్స్. ఏ ఈవెంట్ నిర్వహించుకున్నా.. తప్పనిసరిగా ఆహ్వానించుకునేవారు. ఒకరి సినిమాల్ని మరొకరు బాగానే ప్రమోట్ చేసుకునేవారు. అలాంటిది.. వీరిమధ్య ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకున్నాయో ఏమో చాలారోజుల నుంచి మాట్లాడుకోవడం లేదు. ఇటు అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్లలో బాలయ్య కనిపించకపోవడం.. అలాగే బాలయ్య ఈవెంట్స్‌లో నాగ్ అండ్ కో మిస్సవడం.. తరచూ చూస్తూనే ఉన్నాం. అసలు వీరిమధ్య అంతగా ఏం చెడిందన్నా విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా.. వీరిద్దరూ కలుసుకోవడం గానీ, ఒకరినొకరి గురించి మాట్లాడుకోవడం గానీ జరగకపోవచ్చునని అందరూ ఓ అంచనాకు వచ్చారు. కానీ.. ఒక్క ట్వీట్‌తో ఆ ఊహాగానాల్ని నాగ్ కొట్టిపడేశాడు.
బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 12వ తేదీన రిలీజ్ అవుతుండగా.. ఆ సినిమా కోసం నాగ్ ఓ ట్వీట్ చేశాడు. ‘బాలయ్య, క్రిష్ అండ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. నాకు చారిత్రాత్మక సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఈ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ హిస్టరీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నా’ అని ట్వీటాడు. బాలయ్య సినిమాలపై ఎప్పుడూ ట్వీట్లు చేయని నాగ్.. తొలిసారి ట్వీట్ చేయడంతో టాలీవుడ్‌లో ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తమ మధ్య నిజంగా విభేదాలు ఉన్నాయో లేవో, ఇన్నాళ్లూ ఎందుకు మాట్లాడుకోలేదో తెలీదు కానీ.. ఈ ఒక్క ట్వీట్ మాత్రం ఇటు బాలయ్య ఫ్యాన్స్‌నే కాకుండా నాగ్ అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది. ఏదేమైనా.. టాలీవుడ్‌లో ఇలాంటి మంచి వాతావరణం రావడం నిజంగా హర్షనీయం.
Wishing #Balayya,@DirKrish &team all the best for #GautamiPutraSatakarni/I love watching historicals. Let this one create history!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) 11 January 2017