Nagarjuna and K Raghavendra Rao latest combo movie Om Namo Venkatesaya has created historical record in devotional movies with pre release business.
భక్తిరస చిత్రాలకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది కానీ.. అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభంజనం సృష్టించవు. ఇప్పటివరకు వచ్చిన సినిమాల్నే అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. బిజినెస్‌పరంగా గానీ, కలెక్షన్ల పరంగా గానీ ఈ తరహా సినిమాలు పెద్దగా రికార్డులు సృష్టించిన దాఖలాలు లేవు. కానీ.. తొలిసారి నాగార్జున తాజా భక్తిరస సినిమా మాత్రం రికార్డ్ సృష్టించింది. ఎవరూ ఊహించని స్థాయిలో బిజినెస్ చేసి.. చరిత్ర సృష్టించింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.47.25 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. భక్తి చిత్రాల్లో ఈ రేంజులో బిజినెస్ చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు.. నాగ్ కెరీర్‌లో కూడా ఇది రికార్డ్ ఫిగర్. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ తర్వాత నాగార్జున, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో.. చాలా నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు దీని రైట్స్‌ని భారీ రేట్లకు కొనుగోలు చేశారు. ముఖ్యంగా.. చాలా క్యాల్కులేటెడ్‌గా సినిమాలు కొనే ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నైజాం ఏరియా హక్కుల్ని ఏకంగా రూ.9 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ఏరియాలతోపాటు కర్ణాటక, ఓవర్సీస్‌లను కలుపుకుంటే.. ఓవరాల్‌గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 34 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం సేఫ్ జోన్‌లోకి చేరాలంటే రూ.35 కోట్లపైనే వసూలు చేయాల్సి వుంటుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులతోపాటు ఆడియో రైట్స్ కూడా కలుపుకుంటే.. టోటల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్క రూ.47.25 కోట్లు. ఈ చిత్రం ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏరియాలవారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు :
నైజాం : 9 (దిల్ రాజు)
సీడెడ్ : 4.01
వైజాగ్ : 2.87
గోదావరి : 3.62
కృష్ణా : 1.80
గుంటూరు : 2.25
నెల్లూరు : 1.10
ఏపీ+తెలంగాణ : రూ. 24.65 కోట్లు
కర్ణాటక : 2.70
రెస్టాఫ్ ఇండియా : 0.80
ఓవర్సీస్ : 5.50
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 33.65 కోట్లు
ఆడియో+డిజిటల్ : 1.1
శాటిలైట్ : 12.5
గ్రాండ్ టోటల్ : రూ. 47.25 కోట్లు