మెగాస్టార్ ‘ఖైదీ నెం.150’ 3 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్!!

khaidi no 150 3 days collections

Chiranjeevi’s 150th film Khaidi No 150 third day collections of telugu states are out. According to trade report, this film has earned on third day more than second even Satakarni is in competition.

పదేళ్ల తర్వాత తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్‌తో ఓ చెడుగుడు ఆడుకుంటున్నాడు. తొలిరోజు ‘బాహుబలి’నే బీట్ చేసి చరిత్ర సృష్టించిన ఈ మెగాస్టార్.. ‘శాతకర్ణి’ దెబ్బకు రెండోరోజు కాస్త చతికిలపడ్డా, మూడోరోజు మాత్రం మళ్ళీ పుంజుకున్నాడు.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తొలిరోజు (బుధవారం) ఏపీ, తెలంగాణాల్లో కలుపుకుని రూ.25.05 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా, రెండోరోజు (గురువారం) కేవలం రూ.5.68 కోట్లే రాబట్టింది. అయితే.. మూడోరోజైన శుక్రవారంనాడు రూ.6.61 కోట్లు సాధించింది. అంటే.. మొత్తం మూడురోజుల్లో ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.37.34 కోట్లు (షేర్) కలెక్ట్ చేసిందని ట్రేడ్ లెక్కలు స్పష్టం చేశాయి. ‘శాతకర్ణి’ సినిమా పోటీగా ఉన్నప్పటికీ, మూడోరోజు ‘ఖైదీ’ వసూళ్లు అనూహ్యంగా పెరగడం నిజంగా విశేషమని అంటున్నారు. చిరుకి ఉన్న క్రేజ్ కారణంగానే ఆయన రీఎంట్రీ చిత్రం ఇలా ప్రభంజనం సృష్టిస్తోందని చెబుతున్నారు.

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తన సొంత బ్యానర్ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’పై నిర్మించాడు. తమిళ ‘కత్తి’కి రీమేక్ అయిన ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ చిత్రం మూడురోజుల కలెక్షన్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…

నైజాం : 10.98
సీడెడ్ : 6.00
నెల్లూరు : 1.46
కృష్ణా : 2.33
గుంటూరు : 3.57
వైజాగ్ : 5.29
ఈస్ట్ గోదావరి : 4.26
వెస్ట్ గోదావరి : 3.45
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 37.34 కోట్లు