మెగా కాంపౌండ్‌లో ఉన్న ఇక ఇంపార్టెంట్ పర్సన్ నుంచి ఆ సినిమాకు సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన టీజర్ చూసినప్పుడు, సాంగ్స్ విన్నప్పుడు రాని క్లారిటీ ఆ పర్సన్‌తో మాట్లాడాక వచ్చింది. మెగా 150 ఎలా ఉండబోతోంది? అసలు చిరంజీవి టార్గెట్ ఏంటి? అనే విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ విషయంలో చిరంజీవికి పూర్తి స్పష్టత ఉంది. తన మూడు దశాబ్ధాల అనుభవం అందుకు ఉపయోగపడింది. ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్‌ని బద్ధలు కొట్టడమనే టార్గెట్ కూడా ఉన్నప్పటికీ బాస్ అసలు టార్గెట్ మాత్రం అభిమానులే.
150 తర్వాత కూడా వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్న చిరంజీవి ఈ ఖైదీ నంబర్ 150తో అభిమానులను ఓ రేంజ్‌లో ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడు. ‘ఖైదీ’తో ఒక్క నైట్‌లో సూపర్ స్టార్ ఢం సంపాదించి మెగాస్టార్ అయిన చిరంజీవి ఇప్పుడు ఖైదీ నంబర్ 150తో కూడా అదే ఫీట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఈ జెనరేషన్ ఆడియెన్స్‌లో కూడా ఫ్యాన్ బేస్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాడు. పదేళ్ళుగా వెండితెరపై తన పెర్ఫార్మెన్స్‌ని ఎంజాయ్ చేయలేకపోయిన ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఖైదీ నంబర్ 150 సినిమా దానికి తగ్గట్టుగానే తెరకెక్కింది. ఈ సినిమాలో చిరు స్టైలింగ్ అదిరిపోతుంది. యంగ్ హీరోలతో సమానంగా కనిపిస్తాడు. ఇక ఇంద్ర, ఠాగూర్ సినిమాలలో ఉన్న స్థాయి డ్యాన్సులు ఉంటాయని లారెన్స్ చెప్తున్నాడు. అలాగే చిరు యాక్షన్‌ని ఇష్టపడే వాళ్ళ కోసం మూడు అద్భుతమైన ఫైట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ టైంలో, అండ్ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్ అయితే అద్భుతః అనే రేంజ్‌లో ఉంటాయట. రూపాయి కాయిన్‌తో సౌండ్స్ చేస్తూ వచ్చే ఫైట్ అయితే మార్వలెస్ అని చెప్తున్నారు. సినిమా ఆసాంతం థియేటర్‌లో కూర్చున్న అభిమానులందరూ కూడా పేపర్లు, పూలు చల్లుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేసి అలసి పోయే రేంజ్‌లో మెగా స్టార్ ఎంటర్టైన్‌మెంట్ ఉంటుందని మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో ఉన్న మెస్సేజ్ కూడా కనెక్ట్ అయిందంటే మాత్రం…….ఇక చెప్పేదేముంది…….బాస్ ఈజ్ బ్యాక్……బాక్స్ ఆఫీస్ షేక్…….