మొన్నటివరకు బాహుబలి రికార్డులని కొట్టాలంటే మళ్ళీ బాహుబలి 2 తోనే సాధ్యం అనుకున్నాము. అలాగే నాన్-బాహుబలి రికార్డులని బెంచ్ మార్క్ కూడా పెట్టేశాము. కానీ సంక్రాంతి కి విడుదలైన మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమా కలెక్షన్ల కుమ్ముడుకి ట్రేడ్ వర్గాలు సైతం విస్మయం చెందుతున్నాయి. సంక్రాంతి కి చిరు సినిమా రిలీజ్ అనుకున్నపుడు .. పోటీగా బాలయ్య శాతకర్ణి ఉంది.. అందునా చిరంజీవిది ‘కత్తి’ రీమేక్.. 10 సంవత్సరాల గ్యాప్… అఖిల్ లాంటి అట్టర్ ప్లాప్ ఇచ్చిన వినాయక్ డైరెక్షన్.. ఇలా ఎన్నో మైనస్ లు… కానీ అక్కడ ఉన్నది మెగాస్టార్ అన్నది మరచారు. తాను ఎందుకు మెగాస్టార్ అయ్యాడో ఖైదీ తో.. ఈ తరానికి కూడా చెప్పకనే ‘రుచి చూపించాడు’.
ఇక ఉత్తరాంధ్ర కలెక్షన్ల విషయానికొస్తే బాహుబలి ఫుల్ రన్ లో అక్కడ 9.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే చిరు ఖైదీ 10 రోజుల్లోనే 10 కోట్ల రూపాయల షేర్ సాధించి తన కలెక్షన్ల కుమ్ముడు రుచి చూపించింది. ఇంకా ఫుల్ రన్ లో అక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.