Moviesఅదే కదా మెగాస్టార్ అంటే ...ఫుల్ బిజినెస్ డిటెయిల్స్...కెవ్వు కేక!!

అదే కదా మెగాస్టార్ అంటే …ఫుల్ బిజినెస్ డిటెయిల్స్…కెవ్వు కేక!!

మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా చూపించాడు. మూడు దశాబ్ధాలుగా తానే ఎందుకు నంబర్ వన్ హీరోగా సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడో ప్రూవ్ చేసుకున్నాడు. దాదాపు దశాబ్ధం తర్వాత స్క్రీన్ పైకి వస్తున్నాడు. అరవయ్యవ వడి దాటేశాడు. చిరంజీవి హీరోగా నటించిన ఇంతకుముందు సినిమా శంకర్‌దాదా జిందాబాద్ ఫ్లాప్. అయితేనేం కత్తికి మకిలి పడుతుందా? మెగాస్టార్ స్టామినా చెదురుతుందా? ప్రస్తుతానికి బిజినెస్ వర్గాల్లో మెగా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో బయటికి వచ్చింది. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 ఫుల్ బిజినెస్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ప్రి రిలీజ్ బిజినెస్‌ని వందకోట్లు దాటించాడు చిరంజీవి. రేపు ఇదే రేంజ్‌లో కలెక్షన్స్ కూడా కొల్లగొట్టాడంటే మాత్రం మరో పదేళ్ళ వరకూ చిరంజీవిని కొట్టేవాడు ఉండడు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం నంబర్ వన్ హీరోగా కొనసాగిన స్టార్‌గా చిరంజీవిలా నిలిచిపోతాడు.
ఖైదీ నంబర్ 150 ప్రి రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ః

నైజాం – 21. 5 కోట్లు
సీడెడ్ – 11. 7 కోట్లు
కృష్ణా – 4. 6 కోట్లు
గుంటూరు – 6. 4 కోట్లు
ఉత్తరాంధ్ర – 7. 8 కోట్లు
ఈస్ట్ – 5. 4 కోట్లు
వెస్ట్ – 4. 6 కోట్లు
నెల్లూరు – 3 కోట్లు
కర్ణాటక – 8. 5 కోట్లు
తమిళనాడు – 1 కోటి
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1 కోటి
ఓవర్ సీస్ – 12 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా థియేట్రీకల్ రైట్స్ రూపంలో : 87. 5 కోట్లు

శాటి లైట్ – 13 కోట్లు
ఆడియో మరియు ఇతర రైట్స్ – 2. 5 కోట్లు

మొత్తం – 103 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news