Khaidi no 150 movie 5 days worldwide gross collections report is out and it’s enter in 100 crores club.
మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దకాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి.. ఆయన క్రేజ్ ముందు బాక్సాఫీస్ బద్దలైపోతుందని అంతా చెప్పుకున్నాం.. అలా అనుకున్నట్లుగానే బాస్ సంచలనాలు నమోదు చేశాడు. గతంలో తన పేరిట ఒక్క రికార్డ్ కూడా నమోదు చేసుకోని చిరు.. ఇప్పుడు గత రికార్డుల్ని తుడిచిపెట్టేస్తున్నాడు. ట్రేడ్ వర్గాలే షేక్ అయ్యేలా భారీ వసూళ్లు రాబడుతున్నాడు. ఐదురోజుల లాంగ్ వీకెండ్‌లోనే 100 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేశాడంటే.. ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అవును.. మీరు చదువుతోంది నిజమే. టోటల్ రన్‌లో 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడానికే ఇతర హీరోలు నానాతంటాలు పడుతుంటే.. చిరంజీవి మాత్రం కేవలం ఐదు రోజుల్లోనే అలవోకగా ఆ క్లబ్‌లో చేరిపోయాడు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5 రోజుల్లో రూ.106.12 కోట్లు గ్రాస్ కొల్లగొట్టింది. ఎవరేమనుకున్నా సరే.. ఇది మాత్రం అక్షరాల వాస్తవం. చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిరు క్రేజ్‌తోపాటు ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్డ్ రావడంతో జనాలు దీనికి బ్రహ్మరథం పట్టారని.. అందుకే ఇలా ప్రభంజనం సృష్టించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు దూకుడు చూస్తుంటే.. ఖచ్చితంగా రూ.150 కోట్ల క్లబ్‌లో చేరుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఏరియాల వారీగా 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ (కోట్లలో) :
ఆంధ్రా : 38.50
నైజాం : 20.35
సీడెడ్ : 10.45
టోటల్ ఏపీ+నైజాం : రూ. 69.30 కోట్లు
ఓవర్సీస్ : 22.10
కర్ణాటక : 12.40
రెస్టాఫ్ ఇండియా : 2.30
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 106.12 కోట్లు (గ్రాస్)