‘ఖైదీ నెం.150’ 4 రోజుల కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ని రఫ్ఫాడిస్తున్న మెగాస్టార్!

khaidi-no-150-4-days-collections

Megastar Chiranjeevi’s 150th film 4th day collections report of telugu state is out. According to trade report, 4th day collections are highest than 3rd day report which is damn shocking.

తన ప్రతిష్టాత్మక 150 చిత్రం ‘ఖైదీ నెం.150’ ద్వారా మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్‌ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘శతమానం భవతి’ సినిమాలను వెనక్కు నెట్టి.. భారీ వసూళ్లతో దూసుకెళుతున్నాడు. ఇప్పటికే మూడురోజుల్లో బాక్సాఫీస్‌ని ఉతికి ఆరేసిన చిరు.. నాలుగోరోజు కూడా పిండేశాడు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. తొలిమూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 37.34 కోట్లు కలెక్ట్ చేసిన ‘ఖైదీ’.. నాలుగోరోజు (శనివారం) రూ.7.46 కోట్లు కొల్లగొట్టింది. అంటే.. మొత్తం నాలుగురోజుల్లో ఈ సినిమా కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే రూ. 44.80 కోట్లు (షేర్) రాబట్టింది. చాలాకాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు క్రేజ్ వల్లే ఈ చిత్రం టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఇలా వసూళ్ల వర్షం కురిపిస్తోందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. రూ.8.5 కోట్లు మేర కర్ణాటకలో బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ రాష్ట్రం నుంచి నాలుగు రోజుల్లో రూ.5.89 కోట్లు సాధించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే బ్రేక్‌ఈవెన్‌కి చేరిపోతుందని స్పష్టమవుతోంది. ఇక యూఎస్‌లో ప్రీమియర్లతో కలుపుకుని శుక్రవారం వరకు $1,662,963 (రూ.11.31 కోట్లు) ఖాతాలో వేసుకుంది. ఇన్నే్ళ్ల తర్వాత కూడా చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గకలేదని చెప్పడానికి ఇంతకన్నా రుజువేం కావాలి..?

ఏరియాల వారీగా 4 రోజుల కలెక్షన్ల వివరాలు (కోట్లలో):
నైజాం : 13.33
సీడెడ్ : 7.33
నెల్లూరు : 1.77
కృష్ణా : 2.83
గుంటూరు : 4.13
వైజాగ్ : 6.78
ఈస్ట్ గోదావరి : 4.81
వెస్ట్ గోదావరి : 3.82
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 44.80 కోట్లు (షేర్)