Megastar Chiranjeevi’s comeback film ‘Khaidi Number 150’ is creating tremors with its humongous release. According to the latest news around 400 shows are being planned on the day one in Bengaluru city which is said to be a breathtaking record of recent times.
మెగాస్టార్ చిరంజీవి మైల్‌స్టోన్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ రావడం, దేశవ్యాప్తంగా కొన్ని గంటలపాటు మొదటి స్థానంలో ‘ఖైదీ నెంబర్ 150’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం, రూ.100 కోట్లకుపైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడం.. ఇలాంటి ఇంకెన్నో ఘనతలు సాధించింది. అంతేకాదు.. రిలీజ్ పరంగానూ ఇంతవరకు ఏ తెలుగు మూవీ సాధించని అరుదైన రికార్డుల్ని సైతం సొంతం చేసుకుంది. తాజాగా బెంగుళూరులో ఈ సినిమా ఏకంగా చరిత్ర సృష్టించింది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేవలం బెంగుళూరు సిటీలో ఒక్కటే తొలిరోజు 400 షోలు వేయాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మాస్టర్ ప్లాన్ వేశారు. ఒక తెలుగు సినిమాని ఆ నగరంలో ఈ రేంజులో విడుదల చేసిన దాఖలాలే లేవు. దీంతో.. దీన్ని హిస్టారికల్ రికార్డ్‌గా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దాదాపు దశాబ్దం కాలంపాటు చిరు సినిమాలకు దూరం అయినా.. ఇప్పటికీ ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో ఆయనకు క్రేజ్ ఉందని చెప్పడానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ఎంతైనా.. మెగాస్టార్ అడుగుపెట్టాక గత రికార్డులు తుడిచిపెట్టుకు పోవాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. ఈ రేంజులో ఈ మూవీని విడుదల చేయడాన్ని బట్టి చూస్తే.. బెంగుళూరులో తొలిరోజు ఎవరూ ఊహించని స్థాయిలో భారీ కలెక్షన్లు (షేర్) రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా.. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ’ బ్యానర్‌పై నిర్మించాడు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.