‘ఖైదీ నెం.150’ 7 రోజుల యూఎస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన బాస్

khaidi no 150 7 days usa collections report

Chiranjeevi’s Khaidi No 150 movie has earning very well at the US boxoffice and it gains $2.17M in just 7 days.

తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’తో పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. బాక్సాఫీస్‌ని ఓ కుమ్ముడు కుమ్మేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ప్రీమియర్ల ద్వారానే 1.29 మిలియన్ డాలర్స్ వసూలు చేశాడంటే.. చిరు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత రోజుల్లో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ.. 2 మిలియన్ మార్క్‌ని కూడా క్రాస్ చేసేశాడు. వీక్ డేస్‌లోనూ ‘ఖైదీ’ సినిమా మంచి వసూళ్లనే కలెక్ట్ చేస్తోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. మంగళవారం ప్రీమియర్స్‌తో కలుపుకుని సోమవారం దాకా ‘ఖైదీ’ సినిమా యూఎస్‌లో $2.17M కలెక్ట్ చేసింది. గతంలో తన పేరిట ఒక్క రికార్డ్ కూడా నమోదు చేసుకోని చిరు.. చాలా గ్యాప్ తర్వాత రావడంతోనే ఇలా వసూళ్లు కురిపించడం నిజంగా విశేషం. పైగా.. పాజిటివ్ రిపోర్ట్స్‌తో దూసుకెళుతున్న ‘శాతకర్ణి’, ‘శతమానం భవతి’ సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ.. మంచి కలెక్షన్లు రాబట్టడం మరో విశేషమని అంటున్నారు. ఈ చిత్రం ఇలాగే స్టడీ కలెక్షన్స్ సాధిస్తే, త్వరలోనే 2.5 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేస్తుందని, వీలైతే 3 మిలియన్ క్లబ్‌లో చేరు ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.

రోజుల వారీగా యూఎస్ కలెక్షన్స్ :
మంగళవారం : $1,295,613
బుధవారం : $157,789
గురువారం : $78,410
శుక్రవారం : $142,585
శనివారం : $256,438
ఆదివారం : $180,612
సోమవారం : $65,497
టోటల్ : $2,176,944