Khaidi no 150 movie 2 weeks worldwide collections details are out. This movie heading towards 100 crores.
మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెం.150’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న హంగామా అంతాఇంతా కాదు. తొలిరోజు అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసి టాప్ ప్లేస్ సంపాదించుకున్న ఈ సినిమా… ఐదు రోజుల లాంగ్ వీకెండ్‌లో ఓ కుమ్ముడు కుమ్మేసింది. ఆ తర్వాత కూడా ఊహించని రేంజులో వసూళ్లు రాబడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ ఆల్‌టైం రికార్డ్ సినిమాల జాబితాలో రెండో స్థానం కొట్టేసిన ఈ చిత్రం.. ఇప్పుడు 100 దిశగా ఈ చిత్రం దూసుకెళుతోంది. ప్రస్తుతం ఈ మూవీ రెండు వారాల వసూళ్లు చూస్తే.. ఆ ఫీట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లో రూ. 94.67 కోట్లు షేర్ రాబట్టింది. అందునా.. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 70.82 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇంత తక్కువ టైంలోనే ఈ రేంజ్ వసూళ్లు రావడం బట్టి.. చిరు క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘శాతకర్ణి’, ‘శతమానం భవతి’ చిత్రాలు పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు కలెక్ట్ చేస్తున్నప్పటికీ.. వాటికి గట్టిపోటీనిస్తూ ఇలా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించడం మరో విశేషమని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. తమిళ ‘కత్తి’కి రీమేక్‌గా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2 వారాల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…
నైజాం : 17.81
సీడెడ్ : 13.48
ఉత్తరాంధ్ర : 11.60
ఈస్ట్ గోదావరి : 7.53
గుంటూరు : 6.59
వెస్ట్ గోదావరి : 5.60
కృష్ణా : 5.15
నెల్లూరు : 3.06
ఏపీ+తెలంగాణ : రూ. 70.82 కోట్లు
యూఎస్ఏ : 9.75
కర్ణాటక : 8.50
రెస్టాఫ్ ఇండియా + రెస్టాఫ్ వరల్డ్ : 5.60
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 94.67 కోట్లు (షేర్)