Khaidi No 150 12 days worldwide collections report is out. According to trade, this movie has earned massive amount in second weekend.
బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’సినిమా కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండో వారాంతంలోనూ ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం చూస్తుంటే.. ఇప్పట్లో దీని దూకుడు ఆగేలా లేదు. శాతకర్ణి, శతమానం భవతి సినిమాల్ని పూర్తిగా డామినేట్ చేస్తూ.. తన ఖాతాలో భారీ కలెక్షన్లు జమ చేసుకుంటోంది. మొదట్లో ఈ మూవీకి వచ్చిన రిపోర్ట్ చూసి.. ఫస్ట్ వీకెండ్ తర్వాత వసూళ్లు తగ్గవచ్చునని భావించారు. కానీ.. ఆ ఊహాగానాల్ని పటాపంచలు చేస్తూ, ఊహించని స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతోంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో రూ. 92.36 కోట్లు (షేర్) కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే ఈ మూవీ రూ. 68.56 కోట్లు రాబట్టడం విశేషం. చిరు క్రేజ్ కారణం వల్లే ఈ మూవీ ఇలా వసూళ్ల వర్షం కురిపిస్తోందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. చూస్తుంటే.. ఈ వారంలోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘కత్తి’కి రీమేక్‌గా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 12 రోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…
నైజాం : 17.15
సీడెడ్ : 13.02
ఉత్తరాంధ్ర : 11.09
ఈస్ట్ గోదావరి : 7.40
గుంటూరు : 6.44
వెస్ట్ గోదావరి : 5.50
కృష్ణా : 5.00
నెల్లూరు : 2.96
ఏపీ+తెలంగాణ : రూ. 68.56 కోట్లు
ఓవర్సీస్ : 13.45
కర్ణాటక : 8.45
రెస్టాఫ్ ఇండియా : 1.90
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 92.36 కోట్లు (షేర్)