Newsకౌగిలింతల వ్యాపారం.. గంటకి ఆ ఆంటీ రేటెంతో తెలుసా?

కౌగిలింతల వ్యాపారం.. గంటకి ఆ ఆంటీ రేటెంతో తెలుసా?

A married woman doing hugging business in america and earning more than 1500 dollars in just a week.

డబ్బు… మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. లేనిపోని ఆలోచనలు తెప్పించి.. దేనికైనా లొంగేలా చేస్తుంది. అది మంచా? చెడా? అని ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వదు… బలవంతంగా చేయించేస్తుందంతే. ఇప్పుడో మహిళ ద్వారా ఇదే డబ్బు ఓ వింత వ్యాపారం చేయిస్తోంది. అదే.. కౌగలింతల బిజినెస్. ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఆమెలో తన(డబ్బు)పై వ్యామోహం కలిగించి.. ఆ వ్యాపారం చేయించేలా ఆలోచన తెప్పించింది. ఇప్పుడు దానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. దాంతో.. ఆ అమ్మడు తన ఖాతాలోకి లెక్కలేనంత డబ్బు జమ చేసుకుంటోంది. ఈ బిజినెస్‌కి భర్త కూడా సహకారం అందించడం మరో వింత.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియాలో జెనెత్ ట్రెవీనో, కార్లోస్ దంపతులు నివసిస్తున్నారు. భర్త కార్లోస్ ఓ కంపెనీలో పని చేస్తుండగా.. జెనెత్ (37) ఇంట్లోనే ఖాళీగా ఉంటూ వస్తోంది. ఇలా ఉండడం ఇష్టం లేక.. ఏదైనా ఉద్యోగం చేద్దామని అనుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ‘కౌగిలింతలను’ పూర్తి వ్యాపారంగా మార్చేసింది. 40 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉన్న పురుషుల నుంచి గంటకు 80 డాలర్లు (దాదాపు రూ.5,500) ఫీజు తీసుకుని, ఆమె కౌగిలించుకుంటుంది. ఇలా చేస్తూ ఆమె కేవలం వారానికే 1600 డాలర్లు (దాదాపు రూ.1,09,000) సంపాదిస్తోంది. ఈ వ్యాపారినిక జెనెత్ భర్త కార్లోస్ కూడా పూర్తిగా సహకరిస్తున్నాడు. ఈ వింత వ్యాపారం ఎందుకు ప్రారంభించారు? అని ప్రశ్నించగా.. దానికి బలమైన సమాధానమే ఇచ్చింది జెనెత్.

‘తీవ్ర మనోవేదనలో ఉన్న ప్రజలకు నమ్మకంతోపాటు ధైర్యం కలిగించడం చాలా అవసరం. అలాంటివారిని హృదయానికి దగ్గర తీసుకుని.. నమ్మకం పెంచితే, వారిలో మార్పు వస్తుంది. అందుకే.. ఈ బిజినెస్ ప్రారంభించాను’ అని చెప్పుకొచ్చింది. మొదట్లో తాను పార్ట్‌టైంగా ప్రారంభించగా.. ఈ వ్యాపారానికి ఫుల్ డిమాండ్ పెరగడంతో ఫుల్‌టైంగా మార్చుకున్నానని తెలిపింది. ఓ వెబ్‌సైట్ ద్వారా కౌగిలింతలపై శిక్షణ తీసుకున్నానని, ఓ క్లబ్‌లో కూడా చేరానని జెనెత్ వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news