‘హెడ్ కానిస్టేబుల్’ టీజర్స్ టాక్ : రూటు మార్చిన పీపుల్స్ స్టార్

head constable movie teasers talk narayana murthy

R Narayana Murthy latest movie Head Constable teasers has been released. These videos are very impressive with high quality and energetic action episodes. Narayana Murthy as usual impresses with his style and dialogue delivery.

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాకి సంబంధించి మూడు టీజర్లను రిలీజ్ చేశారు. అందులో రెండు డైలాగ్ ప్రోమో కాగా.. మరొకటి ఓ పాటకి సంబంధించినది. పదండి.. ఆ మూడు ఎలాగున్నాయో చూద్దాం..

మొదట డైలాగ్ ప్రోమోల గురించి మాట్లాడుకుంటే.. ఇందులో ఎప్పట్లానే తన మార్క్ డైలాగులతో నారాయణ మూర్తి అదరగొట్టారు. యాక్షన్ సీన్స్ అయితే పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. ఆయన గత సినిమాల్లో ఈ రేంజ్ యాక్షన్ ఎప్పుడూ చూసి ఉండరు. అచ్చం బాలయ్య సినిమాల్లోలాగే టచ్ చేస్తే విలన్లు గాలిలో ఎగిరిపోయే దృశ్యాల్ని ఇందులోనూ చూడొచ్చు. ఆ సీన్లకు తగ్గట్టుగా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వింటే.. రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. చివరగా పాట టీజర్ గురించి మాట్లాడితే.. వినసొంపుగా ఉన్న ఈ సాంగ్ టీజర్‌లో నారాయణ మూర్తి తన రొమాంటిలో యాంగిల్ బయటపెట్టారు. సుధతో ఆయన కెమిస్ట్రీ బాగానే కుదిరింది. మరో విశేషం ఏమిటంటే.. ఇందులో సీనియర్ ఎన్టీఆర్‌ని కూడా వాడుకోవడం జరిగింది. ఓ ఫ్రేమ్‌లో రామారావు ఫోటోని చూపిస్తూ.. అన్నమాట నిలబెట్టుకునే బాధ్యత ఉందంటూ పాటేసుకున్నారు.

ఓవరాల్‌గా.. ఈ మూడు టీజర్లు చాలా బాగున్నాయి. టెక్నికల్ పరంగానూ ఈ టీజర్లను మంచి మార్కులే పడతాయి. పిక్చరైజేషన్ చూస్తే.. చిన్న సినిమాలా అనిపించదు.. భారీ బడ్జెట్‌తోనే తీసిన మూవీలా అనిపిస్తుంది. ఈ టీజర్లతో నారాయణమూర్తి ఆకట్టుకున్నారు కానీ.. సంక్రాంతి పోరులో గెలుస్తారా? లేదా? అన్నది చూడాలి.

Leave a comment