Gautamiputra Satakarni has only 2 hours and 14 minutes run time which is big advantage for this historical magnum opus.
తన చారిత్రాత్మక చిత్రంతో నందమూరి బాలయ్య చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.. తెలుగువాళ్లు గర్వించేలా దేశం మీసం తిప్పేందుకు రంగంలోకి దిగుతున్నాడు. సెట్స్ మీదకి వెళ్లినప్పటినుంచి తారాస్థాయి అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమాకి రీసెంట్‌గా సెన్సార్ సభ్యులతోపాటు సినిమా చూసిన కొందరు ప్రముఖులు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో.. ఈ మూవీకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా రిలీజ్‌కి ముందే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకి.. మరో విషయం బాగా కలిసొస్తుందని చెబుతున్నారు. అదే రన్‌టైం.
ప్రస్తుతం రన్‌టైం తక్కువగా ఉండే సినిమాల హవానే నడుస్తున్న విషయం అందరికీ తెలుసు. దీంతో.. చాలామంది దర్శకనిర్మాతలు తమ మూవీల నిడివిని తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ కూడా ‘శాతకర్ణి’ సినిమా విషయంలో ఆ ఫార్ములాని పాటించాడు. కేవలం 2 గంటల 14 నిముషాల నిడివి ఉండేలా చూసుకున్నాడు. అసలు సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండానే ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారి చేసింది. దీన్ని బట్టి.. క్రిష్ ముందుగానే తక్కువ నిడివి ఉండేలా ప్లాన్ చేసుకున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఓవైపు పాజిటివ్ రిపోర్ట్స్, మరోవైపు తక్కువ రన్‌టైం, చిత్రంపై నెలకొన్న విపరీతమైన క్రేజ్‌ని బట్టి చూస్తే.. ఈ హిస్టారికల్ చిత్రం ఖచ్చితంగా హిస్టరీ రిపీట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. జనవరి 12వ తేదీన రానున్న ఈ సినిమా.. ఆ అంచనాల్ని అందుకుంటుందా? లేదా? వేచి చూడాలి.