Balayya’s prestigeous 100th project Gautamiputra Satakarni has made huge money before release in the form of table profits. This movie bankrolled by Y Rajeev Reddy, Jagarlamudi Saibabu on First Frame Entertainment banner under Krish Direction.
బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై ప్రారంభం నుంచే ఓ రేంజులో అంచనాలు నెలకొన్న విషయం అందరికీ తెలుసు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నకొద్దీ ఆ చిత్రం ఒక్కొక్కటిగా రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో… ఈ చిత్రానికి మరింత విపరీతమైన క్రేజ్ వచ్చిపడింది. ఆ కారణంగా ఈ సినిమా అంచనాలకు మించే భారీ బిజినెస్ చేసింది. దాంతో.. నిర్మాతలకు రూ.21 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ అదిరిపోయే స్థాయిలో అమ్ముడుపోయాయి. ముఖ్యంగా.. ఆంధ్రాలో ఊహించని రేటుకి ఈ సినిమా రైట్స్ పలికాయి. దాదాపు అన్ని ఏరియాల్లోనూ బాలయ్యకి ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కి మించే ఎక్కువ ధర పలికినట్లు ట్రేడ్ లెక్కలు వెల్లడించాయి. ఇక శాటిలైట్ రైట్స్ కూడా అంతే. బాలయ్య కెరీర్‌లోనే ‘శాతకర్ణి’ హక్కులు రికార్డ్ ధరకి సోల్డ్ అయ్యాయి. ఆడియో రైట్స్ సైతం భారీ రేటుకే కొనుగోలు చేయబడ్డాయి. ఇలా అన్నీ లెక్కలు కలుపుకుంటే.. రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 86 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. అంటే.. రిలీజ్‌కి ముందే ఈ సినిమా నిర్మాతలకు రూ.21 కోట్ల మేర ప్రాఫిట్ తెచ్చిపెట్టిందన్నమాట. దీన్ని బట్టి.. ఈ చిత్రంపై ఏ రేంజులో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియాసరన్ కథానాయికగా నటించగా.. ఆయన తల్లి ‘గౌతమీ’గా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని నటించారు. క్రీ.శ.1-2 శతాబ్దాల మధ్య కాలంలోని శాతవాహనుల చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ మూవీ.. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.