The full details of Gautamiputra Satakarni movie pre release business has been revealed by trade analysts.
బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజ్‌కి ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ద్వారా సోషల్ మీడియాని ఓ కుదుపు కుదుపేసిన ఈ చిత్రం.. ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగానూ తన సత్తా చాటుకుంది. బాలయ్య కెరీర్‌లో ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని అరుదైన రికార్డ్‌ని ఈ మూవీ సొంతం చేసుకుంది. చాలా ఏరియాల్లో ఈ చిత్రం రైట్స్ బాలయ్య మార్కెట్‌కి మించి భారీ రేటుకి అమ్ముడుపోవడం విశేషం.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం రూ.56.16 కోట్లు బిజినెస్ చేసింది. బాలయ్య కెరీర్‌లో ఈ రేంజ్‌లో ఏ సినిమా బిజినెస్ చేయలేదు. దీన్ని బట్టి.. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ చిత్రంపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది బాలయ్య ల్యాండ్‌మార్క్ 100వ చిత్రం కావడం, క్రీ.శ.1-2 శతాబ్దాల మధ్య చెందిన శాతవాహనుల చక్రవర్తి ‘శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా రూపొందుతున్న హిస్టారికల్ మూవీ కావడం వల్లే ఇది ఆ స్థాయిలో బిజినెస్ చేసిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే.. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని, రూ. 100 కోట్లు షేర్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియాశరన్ కథానాయికగా నటించగా.. బాలయ్య తల్లిగా హేమమాలిని నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి , వై. రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి చిరంతన్ భట్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. (కోట్లలో)
నైజాం : 9.05
సీడెడ్ : 9
కృష్ణా + గుంటూరు : 7.5
ఉత్తరాంధ్ర : 4.65
ఈస్ట్ గోదావరి : 3.5
వెస్ట్ గోదావరి : 3.06
నెల్లూరు : 1.95
ఏపీ+తెలంగాణ : రూ. 38.71 కోట్లు
కర్ణాటక : 3.85
ఓవర్‌సీస్ : 4.5
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.60
శాటిలైట్ : 7
ఆడియో అండ్ అదర్ రైట్స్ : 1.5
మొత్తం : రూ. 56.16 కోట్లు