ఇంత వరకూ ఏ సినిమా ఫలితం అయినా కూడా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల ఆదరణను బట్టి డిసైడ్ అయ్యేది. కానీ బాలకృష్ణ సినిమా శాతకర్ణి మాత్రం రిలీజ్‌కి ముందే హిట్ అయిపోయిందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సినిమాకు తెలంగాణా రాష్ట్రం పన్ను మినహాయింపు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపు ఇవ్వనుంది. ఈ సినిమాను చాలా చాలా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించాడు క్రిష్. దాదాపుగా యాభై కోట్ల మార్క్‌కి రీచ్ అయితే చాలు…శాతకర్ణి సినిమా సూపర్ హిట్ క్రిందే లెక్క.
ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పన్ను మినహాయింపు ద్వారా వస్తున్న డబ్బులు….అలాగే మొదటి వారం వరకూ శాతకర్ణి బుకింగ్స్ చూస్తుంటే ఈ హిస్టారికల్ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో జాయిన్ అవ్వడం బాలయ్య సినిమాకు పెద్ద కష్టమేం కాదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. తెలుగు వారందరూ చూడాల్సిన ఓ తెలుగు చక్రవర్తి కథ అన్న విషయం కూడా శాతకర్ణికి పూర్తిగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు. బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు చాలా మంది సినీ లవర్స్ కూడా శాతకర్ణిని తప్పకుండా చూస్తారు. హిస్టారికల్, జానపద సినిమాల కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురు చూస్తున్నారో బాహుబలి సినిమా ఆల్రెడీ నిరూపించింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచెకు కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి. సో…..బాలయ్య సినిమా…జస్ట్ ఫర్వాలేదు అన్న టాక్ తెచ్చుకున్నా చాలు…..కెరీర్‌లోనూ ఫస్ట్ టైం….యాభై కోట్ల లీగ్‌లో బాలయ్య చేరిపోవడం ఖాయమన్నమాట.