According to trade report, Balayya’s prestigeous project Gautamiputra Satakarni will blast the boxoffice on first day with highest collections.
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తున్న బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే.. బాలయ్య తన మైల్‌స్టోన్ మూవీకి ఎంచుకున్న స్టోరీలైన్ సరైందంటూ టాలీవుడ్ మొత్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సందర్భానుకూలంగా ఈ మూవీకి సంబంధించి విడుదలవుతూ వచ్చిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్స్.. తారాస్థాయి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘బాహుబలి’ రేంజ్‌లో ఈ మూవీకి క్రేజ్ వచ్చింది.
అందుకే.. డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ రైట్స్‌ని భారీ రేట్లకు సొంతం చేసుకోగా, ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని సినీజనాలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆకాశాన్నంటే స్థాయిలో అంచనాలు నెలకొనడాన్ని బట్టి చూస్తే.. ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా.. బాలయ్య కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని భారీఎత్తున (అత్యధిక థియేటర్లలో) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే.. మొదటినుంచి ఏమాత్రం నెగెటివ్ ప్రచారం లేకపోవడం. చిన్నచిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతావనిని ఒకే పాలనలోకి తెచ్చిన తొలి భారతీయ చక్రవర్తి ‘శాతకర్ణి’ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడంతో.. నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్ ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇలా అన్నీ లెక్కలు వేసుకుంటే.. ఈ చిత్రం ఫస్ట్ డే ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్ సాధిస్తుందని అంటున్నారు.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ‘శాతకర్ణి’ మూవీ తొలిరోజు రూ.30-33 కోట్ల షేర్, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.22-25 కోట్ల మధ్య షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు రోజు‘ఖైదీ’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ.. దాని ప్రభావం ఏమాత్రం ‘శాతకర్ణి’ కలెక్షన్ల మీద ఉండదని.. సినిమాలోని డైలాగ్ చెప్పినట్లుగానే బాలయ్య ఈ మూవీతో దేశం మీసం తిప్పడం ఖాయమని వారు పేర్కొంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. బాలయ్య ఆల్‌టైం రికార్డ్ సృష్టించినట్లే. చూద్దాం.. ట్రేడ్ వర్గాల అంచనాల్ని ఆయన అందుకుంటాడో లేదో?